ఎమ్మెల్యేల గ్రాఫ్ పెరిగితేనే.. వైసీపీ గెలుపు.. జగన్కు ఇదో హెచ్చరిక..!

Tue Mar 21 2023 22:00:01 GMT+0530 (India Standard Time)

This is Warning For Jagan For YSRCP Victory

వచ్చే ఎన్నికలకు సెమీ ఫైనల్గా పేర్కొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ బోర్లా పడింది. మొత్తం 9 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఆరు దక్కించుకున్నా.. అవి పంటికిందకు చాల్లేదు. కేవలం మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొన్న 108 అసెంబ్లీ నియోజకవర్గాలపరిధిలో ప్రజలు ఇచ్చిన తీర్పు ఇప్పుడు ప్రామాణికంగా మారింది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది?  వైసీపీకి ఇంత వ్యతిరేకత ఎలా వచ్చింది? అనే విషయాలను వైసీపీ అధినేత చర్చించాలి.



మరీ ముఖ్యంగా 108 నియోజకవర్గాల్లోని వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? ఎందుకు విఫలమయ్యారు. వా రి గ్రాఫ్ ఎలా ఉంది? అనే విషయాలపైనా సీఎం జగన్ దృష్టి పెట్టాలి. ప్రధానంగా గడపగడపకు తిరిగినప్ప టికీ.. ప్రజలు ఎందుకు.. ఇలా ఓటేశారనేది ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రజల మధ్య ఉంటే ప్రతి పక్షాలు చేసే విమర్శలు తగ్గుతాయని.. ప్రజలు నిజాలు తెలుసుకోగలుగుతారని.. సీఎం జగన్ చెప్పారు.

అందుకే.. సామదాన భేద దండోపాయాలు వినియోగించి మరీ.. ఎమ్మెల్యేలను ప్రజల మధ్యకు తిప్పారు. అయినప్పటికీ.. 108 నియోజకవర్గాల్లోని గ్రాడ్యుయేట్లు కూడా వైసీపీకి అనుకూలంగా ఓటేయలేక పోయారు. కొన్ని చోట్ల హోరా హోరీ పోలింగ్ జరిగినప్పటికీ.. వైసీపీ గెలుపు గుర్రం ఎక్కలేక పోయింది.

మరీ ముఖ్యం గా తన సొంత జిల్లా కడపలోనే పరాభవం ఎదురు కావడం.. మరింత ఇబ్బందిగా మారింది. ఈ పరిణామా లను గమనిస్తే.. ఎమ్మెల్యే గ్రాఫ్ పెరగాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

ఇప్పటి వరకు వైసీపీ పాలనలో ఎమ్మెల్యేల గ్రాఫ్ పెరగలేదనేది వాస్తవం. ఎందుకంటే.. ప్రతి విషయానికీ సీఎం జగన్ ముందుకు రావడం.. మధ్యలో వలంటీర్లను పెట్టడం.. ఏది ప్రజలకుఅవసరమైనా.. వలంటీర్లే జోక్యం చేసుకోవడం..పథకాలకు.. ఎమ్మెల్యేలకు మధ్య సంబంధాలు కూడా లేకుండా పోవడం వంటివి.. ఎమ్మెల్యేల గ్రాఫ్ను దిగజార్చాయి.

దీంతో ప్రజలకు వారికి మధ్య సంబంధాలు కూడాతెగిపోయాయి. ఈ పరిణామాలతోనే ఇప్పుడు ప్రజలు.. వైసీపీ వైపు మొగ్గు చూపలేదనే మరిన్ని విశ్లేషణలు కూడా వస్తున్నాయి.   



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.