Begin typing your search above and press return to search.

భారత రాజ్యంగం 1950 జనవరి 26 కంటే ముందే తయారైంది.. కానీ..

By:  Tupaki Desk   |   26 Jan 2022 8:58 AM GMT
భారత రాజ్యంగం 1950 జనవరి 26 కంటే ముందే తయారైంది.. కానీ..
X
భారత రాజ్యంగం అమల్లోకి వచ్చిన దినంగా నేడు దేశ వ్యాప్తంగా జెండా పండుగ నిర్వహించుకుంటున్నారు. వాడవాడలా.. మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. అయితే భారత్ కు జెండా పండుగ రెండు సార్లు వస్తుంది. ఒకటి ఆగస్టు 15... మరొకటి జనవరి 26న. అయితే జనవరి 26న జెండా పండుగ నిర్వహించడానికి భారత రాజ్యంగం అమల్లోకి వచ్చిందని అంటున్నారు. అయితే వాస్తవానికి భారత రాజ్యంగం అంతకముందే పూర్తి చేశారు. అయినా కొన్నాళ్ల పాటు ఆగి చివరికి 1950 జనవరి 26న ఆమోదింపజేశారు. దీంతో ఆ రోజును మనం గణతంత్ర దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. అయితే 1950 జనవరి 26 కంటే ముందు జరిగిన పరిణామాలేంటి..? అసలు భారత రాజ్యాంగం ఎప్పుడు పూర్తయింది..?

1929లో జవహర్ లాల్ నెహ్రు ఆధక్షతన లాహోర్లో కాంగ్రెస్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మొదటిసారిగా పూర్ణ స్వరాజ్ ప్రమాణం చేశారు. ఇందులో భాగంగా 1930 జనవరి 26 నాటికి భారతదేశానికి సార్వ భౌమాధికార హోదా బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అయితే ఆ తరువాత కొన్ని పరిణామాలు జరిగి చివరికి 1930 జనవరి 26న మొదటిసారి పూర్ణ స్వరాజ్ జరుపుకున్నారు. అంటే స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహించారు. ఆ తరువాత పలు కారణాల వల్ల మళ్లీ జనవరి 26న స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహించలేదు. 17 ఏళ్లపాటు ఆగి చివరికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహించారు.

అయితే 1950 జనవరి 26న భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆరోజున గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. భారతదేశ మొదటి గణతంత్ర వేడుకలు 1950 జనవరి 26న నిర్వహించారు. ఉదయం 10.18 గంటలకు భారత్ గణతంత్ర రాజ్యంగా అవతరించడంతో మొదటి రాష్ట్రపతిగా డాక్టర్ రాజేంద్రప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత తొలి గణతంత్ర దినోత్సవంలో రాజేంద్రప్రసాద్ 21 గన్ సెల్యూట్ తో జాతీయ జెండాను ఎగురవేశారు. అలా అప్పటి నుంచి జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం.

దేశం స్వంత రాజ్యంగా ఉండాలని 1947 ఆగస్టు 15 కంటే ముందే నిర్ణయించారు. అయితే స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు సాగిన సమావేశాల తరువాత 1949న రాజ్యాంగ సభచే భారత రాజ్యాంగం రూపొందించారు. ఆ తరువాత ఆమోదించడంతో 1950 జనవరి 26 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం 73వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఇదిలా ఉండగా జనవరి 26కు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈరోజు అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. 2001 జనవరి 26న గుజరాత్లో భారీ భూకంపం సంభవించింది. ఇది పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్ దేశాలపై పడింది.