ఏపీలో స్కూల్ కు పంపాలంటే ఈ పత్రం తప్పనిసరి

Mon Sep 21 2020 11:30:36 GMT+0530 (IST)

This document is mandatory for sending to school in AP

కరోనా నేపథ్యంలో కొన్ని దశాబ్దాల కాలంలో చూడని సిత్రమైన ఎన్నో విషయాల్ని ఇప్పుడు చూస్తున్నాం. మార్చి అన్నంతనే పరీక్షలు.. ఏప్రిల్ అన్నంతనే సెలవులు షురూ కావటం లాంటివి మహమ్మారి పుణ్యమా అని మిస్ అయిపోయాయి. ప్రతి ఏటా జూన్ లో షురూ అయ్యే విద్యా సంవత్సరం ఈసారి ఇప్పటివరకు మొదలు కాలేదు. కేంద్రం చొరవ తీసుకొని అనుమతులు ఇస్తున్న నేపథ్యంలో దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఈ రోజు నుంచి స్కూళ్లను ఓపెన్ చేస్తున్నారు.కేసులు అధికంగా నమోదవుతున్న కొన్ని రాష్ట్రాల్లో స్కూళ్లను ఓపెన్ చేయాలని డిసైడ్ చేశారు. అందులో ఏపీ ఒకటి. అయితే.. తల్లిదండ్రులు తమ పిల్లల్ని స్కూళ్లకు పంపాలని డిసైడ్ అయినంత మాత్రానే సరిపోదు. వారు తమ అంగీకారంతో ఒక పత్రాన్ని పూర్తి చేసి స్కూల్లో ఇస్తే తప్పించి అనుమతించరు.

ఇంతకీ ఈ అంగీకార పత్రంలో ఏముందన్నది చూస్తే.. మా అబ్బాయి లేదంటే అమ్మాయి ఫలానా స్కూల్లో చదువుతున్నరు. కొవిడ్ 19 నేపథ్యంలో మా పిల్లల్ని స్కూళ్లకు పంపేందుకు మాకు మేముగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి.. మా అంగీకారంతోనే స్కూళ్లకు పంపుతున్నామని చెప్పటమే కాదు.. సంతకం పెట్టి.. ఫోన్ నెంబరు.. ఆడ్రస్ పూర్తి చేసిన తర్వాత మాత్రమే విద్యార్థుల్ని అనుమతించనున్నారు. మరీ.. అంగీకార పత్రంతో పాటు ఎంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని స్కూళ్లకు పంపుతారో చూడాలి.