Begin typing your search above and press return to search.

హనీట్రాప్ ఉచ్చు విసిరే ఆమె.. ఒక జాతీయ పార్టీ మహిళా నేత!

By:  Tupaki Desk   |   15 Oct 2021 4:39 AM GMT
హనీట్రాప్ ఉచ్చు విసిరే ఆమె.. ఒక జాతీయ పార్టీ మహిళా నేత!
X
రీల్ స్టోరీకి ఏ మాత్రం తీసిపోని రీతిలో ఉన్న ఈ ఉదంతం గురించి తెలిసిన వారంతా షాక్ తింటున్నారు. నిజమేనా? అంటూ ఒకటికి రెండుసార్లు వాకబు చేస్తున్నారు. కర్ణాటక.. తమిళనాడుల్లో హాట్ టాపిక్ గా మారిన ఈ వ్యవహరం హై సర్కిల్స్ లో ఇప్పుడు సంచలనంగా మారింది. వ్యాపార రంగంలో ప్రముఖులైన వారిని.. ఉన్నతాధికారుల్ని టార్గెట్ చేయటం.. వారిని తెలివిగా మాటల్లోకి దింపి.. ఆ తర్వాత ముగ్గులోకి దింపటం ద్వారా తన టాలెంట్ చేసిన హైప్రొఫైల్ మహిళ ఉదంతం మింగుడుపడనిదిగా మారింది. సదరు కిలేడీ.. మామూలు వ్యక్తి కాదని.. ఒక జాతీయ పార్టీకి చెందిన మహిళా నేత అని.. తమిళనాడు రాష్ట్రంలో ప్రముఖురాలిగా చెబుతున్నారు.

సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే.. తమిళనాడుకు చెందిన మహిళ కర్ణాటకలో ఉంటారు. చూసేందుకు చక్కగా ఉండటమే కాదు.. డీసెంట్ గా ఉండే ఆమెను చూసినంతనే ఆకర్షితులయ్యేంత అందంగా ఉంటుందని చెబుతారు. టార్గెట్ చేసి మరీ కొందరు బడా బాబుల్ని గుట్టుగా ముగ్గులోకి దింపటం.. ఎంజాయ్ చేద్దామన్న పేరుతో ఉచ్చు బిగించి.. వారికి సంబంధించిన వీడియోల్ని రహస్యంగా తీయటం.. వాటిని చూపించి భారీగా డబ్బులు గుంజటంలో ఆమె టాలెంట్ వేరని చెబుతారు.

తాజాగా బెంగళూరుకు చెందిన ఒక కాంట్రాక్టర్ కు ఇలానే వలపు వల విసిరి.. అతడ్ని సైతం తన బాధితుల ఖాతాలో చేర్చుకున్న ఈ మహిళ పెట్టే టార్చర్ భరించలేక సదరు కాంట్రాక్టర్ పోలీసుల్ని ఆశ్రయించారు. దాచుకోకుండా తాను చేసిన కక్కుర్తి పనిని వివరంగా చెప్పటంతో పాటు.. దానికి బదులుగా తాను పడుతున్న నరకయాతనను వివరించి చెప్పేశాడు. దీంతో సదరు కిలేడీ లెక్క తేల్చేందుకు రంగంలోకి దిగారు అన్నపూర్ణేశ్వరి పోలీస్ స్టేషన్ కు చెందిన పోలీసులు.

పక్కా ప్లాన్ తో సదరు కిలేడీని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆమె ప్రొఫైల్ గురించి తెలిసిన వారు నోటి వెంట మాట రాని పరిస్థితి. ఆమె.. పక్కనే ఉన్న తమిళనాడులోని ఒక జాతీయ పార్టీకి చెందిన మహిళా నేత అని.. ఆమె సదరు పార్టీలో కీలక పదవిలో ఉన్న విషయాన్ని గుర్తించారు. అదే సమయంలో పోలీసులకు భారీ ఎత్తున ఒత్తిళ్లు రావటంతో.. ఏం చేయాలో పాలుపోక కిందామీదా పడుతున్నట్లు చెబుతున్నారు. మరీ.. ఉదంతం రానున్న రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు.. తన వివరాలు బయటకు పొక్కితే.. తన చేతిలో హనీట్రాప్ బాధితుల చిట్టా విప్పుతానని.. ఆ దెబ్బతో వారి కుటుంబాలకు దారుణమైన ఇబ్బందులు ఎదురవుతాయన్న వాదన నేపథ్యంలో ఏం జరగనుందన్నది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ గా మారింది.