Begin typing your search above and press return to search.

చాట్ జీపీటీతో ఈ ఉద్యోగాలు ఊడినట్టే?

By:  Tupaki Desk   |   22 March 2023 8:00 AM GMT
చాట్ జీపీటీతో ఈ ఉద్యోగాలు ఊడినట్టే?
X
కొత్త ఒక వింత.. పాత ఒక రోత అంటారు. ఏదైనా కొత్తగా వస్తే దాన్ని స్వీకరించాలి. దాని ఫలితాలు అనుభవించాలి. ఒకప్పుడు ల్యాండ్ ఫోన్ మాత్రమే ఉండేది. అనంతరం వైర్ లెస్ స్మార్ట్ ఫోన్ వచ్చింది.  ల్యాండ్ ఫోన్ తోనే ఆగిపోతే ఇప్పటి ‘స్మార్ట్ విప్లవం’ మనం చూసేవాళ్లం కాదు. అయితే మన ఆవిష్కరణలు మనకు ఎంత మేలుచేస్తాయో అంతే స్థాయిలో చెడును చేస్తాయి. మనల్ని మనం అన్వయించుకొని ముందుకెళ్లినప్పుడే మనుగడ సాగించగలం. అది అన్వయించుకొని మన ప్రతిభకు ఇనుమడింప చేసుకొని కొత్త మార్గాల్లో వెళితేనే సక్సెస్ తీరాలకు చేరుతాం. దానికి కావాల్సిందల్లా మన కమిట్ మెంట్ మాత్రమే. తాజాగా ‘చాట్ జీపీటీ’ వచ్చింది. దీనిదెబ్బకు లక్షల ఉద్యోగాలు ఊడిపోతాయన్న భయం నెలకొంది. దీన్ని తయారు చేసిన వారు కూడా ఈ టెక్నాలజీ మానవుల పని కొరతను నివారిస్తుందని అంటున్నారు. ప్రధానంగా కొన్ని రంగాల ఉద్యోగాలను ఇది భర్తీ చేయవచ్చని అంటున్నారు. అదే జరిగితే చాలా మంది ఉద్యోగాలు పోయి రోడ్డునపడడం ఖాయమని తెలుస్తోంది. దేన్నైనా స్వీకరించి మనల్ని మనం మెరుగుపరుచుకుంటే ఇలాంటి చాట్ జీపీటీలు వంద వచ్చినా మనం నిలదొక్కుకోగలం.. కావాల్సిందల్లా మనకు మనపై నమ్మకం.. కొత్తగా ఆలోచించే దృక్పథం..

తాజాగా మానవజాతి చేసిన కొత్త ఆవిష్కరణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్ జీపీటీ అందరినీ భయపెడుతోంది. ముఖ్యంగా ఉద్యోగులను... ఈ సాఫ్ట్‌వేర్‌ను ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు ఉపయోగిస్తున్నారు. చాట్‌బాట్ కొన్ని తప్పులు చేసినప్పటికీ, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేసే వ్యక్తులకు ప్రత్యామ్నాయంగా ఉంటుందని నిరూపితమైంది..

ఇప్పుడు చాట్ జీపీటీ  రాకతో లక్షల మంది ఉద్యోగాలు ప్రమాదంలో పడుతాయన్న భయాలు నెలకొంటున్నాయి. ప్రమాదంలో ఉన్న ఉద్యోగాలను తెలుసుకోవడానికి తాజాగా ఓ పరిశోధన జరిగింది. చాలా రంగాల ఉద్యోగాలు చాట్‌బాట్‌కు ప్రభావితమై ప్రమాదంలో పడుతాయని తేలింది. ప్రమాదంలో ఉన్న ఉద్యోగాలు  అధిక జీతం వచ్చేవి కావడం గమనార్హం. జీపీటీతో వారు ఉద్యోగులను కోల్పోవడం భవిష్యత్తులో ఖాయమని.. నిరుద్యోగులుగా మార్చవచ్చని తేలింది.

ఓపెన్ ఏఐ మరియు యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా పరిశోధకులు ఈ చాట్ జీపీటీ ఎఫెక్ట్ పడే రంగాలు.. జీపీటీ ద్వారా భర్తీ చేయగల ఉద్యోగాలపై ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. ఇందులో గణిత శాస్త్రజ్ఞులు, టాక్స్ కన్సెల్టెన్సీ ఉద్యోగాలు , ఫైనాన్స్ ఉద్యోగాలు, రచయితలు, కంటెంట్ రైటర్లు, వెబ్ , డిజిటల్ ఇంటర్‌ఫేస్ డిజైనర్లు చాట్‌బాట్ యొక్క కొత్త సాంకేతికతతో ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని తేల్చారు.  ఈ రంగాల వారికి ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం 100 శాతం ఉందని తేల్చారు.

రైటర్లు, వెబ్ డిజిటల్ డిజైనర్లు, గణిత శాస్త్రజ్ఞులు, ట్యాక్స్ డిపార్టెంట్ , బ్లాక్‌చెయిన్ ఇంజనీర్లు, అనువాదకులు , రచయితలు అత్యంత ప్రమాదంలో ఉన్నారని తేలింది. వీరిని చాట్ జీటీపీ భర్తీ చేస్తుందని పరిశోధన నిగ్గుతేల్చింది. సాఫ్ట్‌వేర్‌ రంగానికి ఎఫెక్ట్ అని తేలింది. చాట్ జీపీటీతో ఈ ఉద్యోగాలను భర్తీ చేయవచ్చని నిరూపితమైంది. కొన్ని వృత్తులు పెద్ద ప్రమాదంలో ఉన్నప్పటికీ, సగటున 20 శాతం మంది ఉద్యోగులు తమ వృత్తికి చాట్ జీపీటీతో ప్రమాదం ఉందని భావిస్తున్నారు.

చాట్‌బాట్ అనేది ఒక సాఫ్ట్‌వేర్ అప్లికేషన్, ఇది కృత్రిమ మేధస్సు ఆధారంగా పనిచేస్తుంది.  వినియోగదారుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చేలా అభివృద్ధి చేయబడింది. వినియోగదారులు చాట్‌బాట్‌ని కొన్ని ప్రశ్నలు అడిగితే ఏఐ ఆధారిత వర్చువల్ అసిస్టెంట్ తో అది సమాధానమిస్తుంది. ప్రోగ్రామింగ్ తో నడుస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.