Begin typing your search above and press return to search.

మోడీకి దూరం స‌రే.. నేత‌లు ద‌గ్గ‌ర‌య్యే దారేదీ?

By:  Tupaki Desk   |   30 May 2023 5:00 AM GMT
మోడీకి దూరం స‌రే.. నేత‌లు ద‌గ్గ‌ర‌య్యే దారేదీ?
X
ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీని దూరంగా పెట్టాల‌ని.. ఆయ‌న‌ను ఏకాకి చేయాల‌ని నిర్ణ‌యించుకున్న ప్ర‌తి ప‌క్షాలు ఈ విష‌యంలో విజ‌యం ద‌క్కించుకున్నాయి. రెండు కీల‌క కార్య‌క్ర‌మాల‌కు డుమ్మా కొట్ట‌డం ద్వారా మోడీని ఒక‌ర‌కంగా ఆలోచ‌న‌లో ప‌డేశాయ‌నే చెప్పాలి. ఒక‌టి నీతిఆయోగ్ గ‌వ‌ర్నింగ్ బాడీ స‌మావేశం. ఇది అత్యంత కీల‌క‌మైన స‌మావేశం. ప్ర‌తిమూడేళ్ల‌కు ఒక‌సారి మాత్ర‌మే ప్ర‌ధాని అధ్య‌క్షత‌న ఈ స‌మావేశం జ‌రుగుతుంది.

అయితే.. దీనికి బీజేపీ యేత‌ర రాష్ట్రాల నుంచి కేవ‌లం ఏపీ సీఎం జ‌గ‌న్‌, ఉత్త‌రాఖండ్‌, జార్ఖండ్ ముఖ్య‌మంత్రులు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. మిగిలిన పెద్ద‌రాష్ట్రాలైన త‌మిళ‌నాడు, ప‌శ్చిమ బెంగాల్‌, తెలంగాణ‌, పంజాబ్‌, రాజ‌స్తాన్ స‌హా ఇత‌ర రాష్ట్రా ల వారు హాజ‌రుకాకుండా.. ఉండిపోయారు.

ఇక‌, రెండోది పార్ల‌మెంటు నూత‌న భ‌వ‌నం ప్రారంభోత్స‌వం. ఈ కార్య‌క్ర‌మం ప్ర‌క‌టించిన రోజే.. ప్ర‌ధాని కాదు రాష్ట్ర‌ప‌తితో ఈ భ‌వ‌నాన్ని ప్రారంభించాల‌ని ప‌ట్టుబ‌ట్టిన నాయ‌కులు.. కార్య‌క్ర‌మానికి దూరంగా ఉన్నారు.

సో.. మొత్తంగా ఈ రెండు కీల‌క కార్య‌క్ర‌మాల‌కు కూడా మోడీకి దూరంగా ఉండిపోయాయి. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే.. ఇలా మోడీని దూరంగా ఉంచిన పార్టీలు.. ద‌గ్గ‌ర‌య్యే సూచ‌న‌లు అయితే.. క‌నిపించ‌డం లేదు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ అంటే ప‌డ‌డం లేదు.ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు కూడా ఇదేప‌రిస్థితి ఉంది. బిహార్ సీఎం నితీశ్‌కు కేసీఆర్ అంటే.. ఇష్టం లేదు. పైకి మాట్లాడుతున్నా.. కేంద్రంలో అధికారం పంచుకునే విష‌యంలో ఒక నిర్ణ‌యానికి రాలేక పోతున్నారు.

వెర‌సి ఆయా పార్టీలు.. మోడీని దూరం పెట్టినా.. నేత‌లు ద‌గ్గ‌ర‌య్యేలా క‌నిపించ‌డం లేదు. పోనీ.. వీరిని ఒకే తాటిపై న‌డిపించేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయా? అంటే.. దీనికి ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు.

నిన్న మొన్న‌టి వ‌ర‌కు మ‌హారాష్ట్ర మాజీ సీఎం శ‌ర‌ద్ ప‌వార్ కొంత ప్ర‌య‌త్నం చేసినా.. ఆయ‌న కూడా దూరంగా ఉన్నారు. ఇలా.. నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త లేనంత వ‌ర‌కు.. మోడీని దూరం పెట్టినా.. ప్ర‌యోజ‌నం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.