Begin typing your search above and press return to search.

వైరల్: కుమారుడిని మింగేసిన సొరచేప... తండ్రి చూస్తుండగానే..

By:  Tupaki Desk   |   9 Jun 2023 3:25 PM GMT
వైరల్: కుమారుడిని మింగేసిన సొరచేప... తండ్రి చూస్తుండగానే..
X
అడవిలో సింహాలు, పులులు ఎంత క్రూర మైనవో, ప్రమాదకర మైనవో సముద్రంలో షార్క్స్ కూడా అంతే ప్రమాదకర మైనవి. ఈ సొర చేపలు మనుషులను పూర్తిగా మింగేసిన ఘటనలు కూడా ఉన్నాయి. అయితే వీటి జోలికి వెళ్తేనే ఇవి దాడి చేస్తాయి. అందుకే సముద్ర ప్రయాణాలు చేసే వారు వీటికి మరీ దగ్గరగా వెళ్లాలి అనుకోరు. చేపలు పట్టేవారు వీటి పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.

ఎందుకంటే అవి ఎప్పుడు ఏ వైపు నుంచి ఎలా దాడి చేస్తాయో ఊహించడం చాలాకష్టం. అందుకే సముద్రాలపై వెళ్లేవారు సొర చేపలను చూస్తేనే ఆమడ దూరం పారిపోతున్నారు. అయితే తాజాగా ఓ మనిషిని సొర చేప మింగిన వీడియో వైరల్ గా మారింది.

అసలు ఏం జరిగిందంటే... ఈజిప్ట్‌ లోని ఎర్ర సముద్రం రిసార్ట్‌ లో ఓ యువకుడు ఈత కొడుతున్నాడు. ఆ సమయంలో సొరచేప అతడిపై దాడి చేసింది.

దాని నుంచి తప్పించుకునేందుకు యువకుడు తీవ్రంగానే ప్రత్నించాడు. తనను వెంటాడుతున్న సొర నుంచి తప్పించు కునేందుకు వేగంగా ఈదడం ప్రారంభించాడు. కానీ, సొర చేప అంతే వేగంగా వచ్చి అతడిని నీటిలోకి పట్టుకెళ్లి పోయింది.

ఇక ఈ ఘటన జరిగిన సమయంలో యువకుడి తండ్రి అక్కడి నుంచి దగ్గరలోనే ఉన్నాడు. కుమారుడిపై సొర దాడి చేయడం చూసిన తండ్రి వెంటనే బోటులో అతని దగ్గరికి వెళ్లాడు. కానీ, అతడు వచ్చేసరికి సొర చేప యువకుడిని నీటి లోపలికి లాక్కెళ్లిపోయింది.

తండ్రి కళ్ల ముందే కొడుకును మింగేసింది ఆ సొర చేప. కాగా మృతుడిని రష్యాకు చెందిన వ్లాది మిర్ పొపొవ్‌ గా అధికారులు గుర్తించారు. కొడుకు మృతితో తండ్రి బోరున విలపిస్తున్నాడు. అతని కుటుంబం విషాదంలోకి మునిగిపోయుంది. ఇక ఈ విషయాన్ని హుర్ఘదా లోని రష్యన్ కాన్సు లేట్ వెల్లడించింది. అయితే ఈ సంఘటన అంతా వీడియోలో రికార్టు చేశారు. అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.