Begin typing your search above and press return to search.

ఇండియా బాండ్ ఇంటి దగ్గర ఆ ఘటన.. ముగ్గురు కమాండోల జాబ్ పీకేశారు

By:  Tupaki Desk   |   18 Aug 2022 4:37 AM GMT
ఇండియా బాండ్ ఇంటి దగ్గర ఆ ఘటన.. ముగ్గురు కమాండోల జాబ్ పీకేశారు
X
ఆయన ఆషామాషీ వ్యక్తి కాదు. కొందరు అయితే ఆయన్ను భారత జేమ్స్ బాండ్ గా అభివర్ణిస్తుంటారు. మోడీ ప్రభుత్వంలో అత్యంత కీలకమైన స్థానంలో ఉన్న ఆయన మరెమరో కాదు.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్. వ్యక్తిత్వంలో కానీ.. కమిట్ మెంట్ విషయంలో కానీ ఆయన్ను వేలెత్తి చూపే వీల్లేదన్న మాట పలువురి నోట వినిపిస్తూ ఉంటుంది.

అలాంటి డోభాల్ ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తి చేసిన హడావుడి నేపథ్యంలో.. ఈ ఉదంతంపై సీరియస్ అయిన కేంద్రం ఏకంగా ముగ్గురు కమాండోలను ఉద్యోగాల నుంచి పీకేయటమే కాదు.. ఆయన సెక్యురిటీని పర్యవేక్షించే డీఐజీ.. కమాండెంట్ లను వేరే చోటుకు బదిలీ వేటు వేశారు. షాకింగ్ గా మారిన ఈ ఉదంతంలో అసలేం జరిగిందన్నది ఇప్పుడు కొత్త చర్చకు తెర తీసింది.

దాదాపు ఆర్నెల్ల క్రితం అంటే.. ఫ్రిబరిలో డోభాల్ ఇంటి వద్ద ఒక వ్యక్తి హల్ చల్ చేశాడు. తన ఒంట్లో చిప్ ఉంచారంటూ పేర్కొన్న అతను.. ఢోబాల్ ఇంటికి అద్దె కారులో వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడి వాహనాన్ని అడ్డుకొని..

అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఇదంతా జరిగే సమయంలో డోబాల్ ఇంట్లోనే ఉన్నారు. దీంతో.. ఇష్యూ మరింత సీరియస్ గా మారింది.సదరు వ్యక్తి చెప్పిన మాటలు కూడా మిగిలిన వారిని అప్రమత్తం అయ్యేలా చేసింది. తన శరీరంలో చిప్ పెట్టారని..

వారే తనను కంట్రోల్ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. అతడ్ని క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు.. అతడి ఒంట్లో ఎలాంటి చిప్ లేదన్న విషయాన్ని లెక్క తేల్చారు. అతడిది బెంగళూరు అని.. మానసిక పరిస్థితి సరిగా లేదన్న విషయాన్ని గుర్తించారు. దీంతో.. అతడ్ని అదుపులోకి తీసుకొని ఢిల్లీ ప్రత్యేక పోలీసులకు అప్పగించారు.

ఈ మొత్తం ఎపిసోడ్ పై కేంద్రం సీరియస్ అయ్యింది. భద్రతా లోపాలకు కారణమైన ముగ్గురు కమాండోలను ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తే.. ఉన్నతాధికారులు ఇద్దరిపై బదిలీ వేటు వేయటం ద్వారా.. డోభాల్ కు కేంద్రం ఇచ్చే ప్రాధాన్యత ఏమిటన్నది మరోసారి స్పష్టమైందని చెప్పాలి.