Begin typing your search above and press return to search.

షాకింగ్: కేంద్ర ఆరోగ్య మంత్రిని కొట్టిన గార్డు.. అయినా జాబ్ తీయలేదు

By:  Tupaki Desk   |   20 Sep 2021 4:04 AM GMT
షాకింగ్: కేంద్ర ఆరోగ్య మంత్రిని కొట్టిన గార్డు.. అయినా జాబ్ తీయలేదు
X
మంచితనానికి ఒక హద్దు ఉంటుంది. కానీ.. అందుకు భిన్నంగా చోటు చేసుకున్న ఉదంతం గురించి వింటే అవాక్కు కావటం ఖాయం. వ్యవస్థలోని చెడును తీయటం సరైనదే కానీ.. ద్రష్టికి వచ్చిన విషయాల్ని వదిలేయటం కూడా తప్పే అవుతుంది. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రి మన్ సుఖ్ మాండవీను ఒక గార్డు చేయి చేసుకున్న షాకింగ్ నిజం బయటకు వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే వెల్లడించటం మరో విశేషం. కేంద్రమంత్రిపై గార్డు చేయి చేసుకుంటుంటే.. పక్కనే ఉండే గార్డులు ఏం చేస్తున్నారన్న సందేహం రావొచ్చు. కానీ.. జరిగింది అందుకు భిన్నం. అదేమన్నది కేంద్రమంత్రే స్వయంగా వెల్లడించారు.

దేశ రాజధాని ఢిల్లీలోని సఫ్దార్ జంగ్ ఆసుపత్రికి ఆకస్మిక తనిఖీ కోసం ఇటీవల ఆ ఆసుపత్రికి సాధారణ రోగిలా వచ్చారు కేంద్రమంత్రి. అక్కడ ఉన్న ఒక బెంచీపై కూర్చుంటుండగా.. అక్కడే ఉన్న ఒక సెక్యురిటీ గార్డు.. .ఆయన్ను బలవంతంగా లేపటమే కాదు.. చేయి చేసుకున్నాడట. ఆ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రే స్వయంగా వెల్లడించారు.సదరు ఆసుపత్రిలో కొత్త వార్డుల్ని ప్రారంభించేందుకు వచ్చిన ఆయన.. ఆ విషయాన్ని సభాముఖంగా చెప్పి షాకిచ్చారు.

తనకు ఎదురైన చేదు అనుభవం గురించి ప్రధానమంత్రి మోడీకి తెలియజేశానని చెప్పారు. అంతేకాదు.. తన మీద చేయి చేసుకున్న గార్డు మీద చర్యలు తీసుకోలేదని.. అతన్ని ఉద్యోగం నుంచి తొలగించలేదన్నారు. తన లక్ష్యం వ్యక్తులు కాదని.. వ్యవస్థగా చెప్పిన ఆయన.. ఆసుపత్రిలోని వైద్యులు.. సిబ్బంది సమన్వయంతో పని చేస్తేనే రోగులకు మెరుగైన సేవలు అందుతాయని పేర్కొన్నారు.

మంచితనం ఉండటం బాగానే ఉన్నా.. అతి మంచితనం సమస్యలకు కారణంగా మారుతుంది. ఒక గార్డు తప్పు చేసినప్పుడు.. అతన్ని వ్యవస్థలోని లోపంగా చూసే వేళలోనే.. వ్యక్తిగా కూడా తప్పు చేస్తున్నారన్నది మర్చిపోకూడదు. సామాన్యుడిగా ఆసుపత్రికి వచ్చిన కేంద్రమంత్రికి ఎదురైన చేదు అనుభవం..రోజువారీగా మరెంతమంది సామాన్యులకు ఎదురవుతుందన్నదో ఆయన మర్చిపోకూడదు. పద్దతి బాగోలేనప్పుడు చర్యల కత్తి ఝుళిపించకుంటే.. దాన్నో బలహీనతగా తీసుకొని మరింత చెలరేగిపోతే ఏమవుతుందన్న విషయాన్ని కేంద్రమంత్రి ఎందుకు మిస్ అవుతున్నట్లు?