Begin typing your search above and press return to search.

'కరెంట్' షాక్ ఇచ్చేందుకు రెడీ అయిన సర్కార్

By:  Tupaki Desk   |   12 Feb 2022 6:31 AM GMT
కరెంట్ షాక్ ఇచ్చేందుకు రెడీ అయిన సర్కార్
X
తెలంగాణ వినియోగదారులపై విద్యుత్ భారం విపరీతంగా పడనుంది. కరెంట్ చార్జీలతో పాటు ట్రూ అప్ చార్జీలు వేడయంతో బేంబేలెత్తుతున్నారు. సాధారణ కరెంట్ ఛార్జీలతో పాటు ట్రూఅఫ్ చార్జీలు భారీగా పడడంతో వినియోగదారుని గుండే గుభేలంటోంది. ఇప్పటికే యూనిట్ వారీ చార్జీలు పెంచేందుకు విద్యుత్ నియంత్రణ మండలికి ప్రతిపాదనలు అందాయి. అందుకు సంబంధించిన ప్రతిపాదనలు త్వరలో సమర్పించనున్నారు.

అయితే అంచనాలకు మించి ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేసినప్పుడు విద్యుత్ చార్జీలతో పాటు ట్రూఅప్ చార్జీలను పెంచాలి. ఏటా దీనికి సంబంధించిన ప్రతిపాదనలు పంపించాలి. అయితే రాష్ట్రంలో వరుస ఎన్నికలు రావడంతో విద్యుత్ చార్జీల ప్రతిపాదనను, అటు ట్రూఅప్ చార్జీలను పెంచకుండా డిస్కమ్ లను తొక్కపట్టిందని విద్యుత్ సంస్థ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇటీవల విద్యుత్ డిస్కమ్ లు వార్షిక ఆవసరాన్ని ప్రకటించారు. 2022-23 సంవత్సరానికి సంబంధించి తాము ప్రతిపాదించిన విషయాన్ని బయటపెట్టాయి. ఇందులో ట్రూఅప్ చార్జీల విషయంపై గురించి కూడా వివరించారు. ట్రూఅప్ చార్జీల విషయం వెనక్కి వెళ్లడంతో ఏడేళ్లుగా డిస్కమ్ లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. అయితే ఈ నష్టాన్ని పూడ్చుకునేందుకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో కరెంట్ చార్జీలతో పాటు ట్రూఅప్ చార్జీలను కూడా వసూలు చేయాలని ప్రతిపాదించాయి. 2019-20, 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాలకు ఏఆర్ఆర్లు దాఖలు చేయడగా ఇటవలే ఈఆర్ సీ వాటిని తిప్పి పంపింది. 2016 -17 నుంచి విద్యుత్ సంస్థలు ట్రూ అప్ పిటిషన్లే వేయకపోవడంతో ఇప్పుడు ఐదేళ్ల చార్జీలు ఒకేసారి వినియోగదారులపై మోత మోగించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

ఐదేళ్ల నుంచి రూ.35,743 కోట్లు డిస్కమ్ లకు రావాల్సి ఉంది. ఈ మొత్తాన్ని ఇప్పుడు వినియోగదారుల నుంచి వసూలు చేయనున్నారు. అయితే దీనికి విద్యుత్ సంస్థలు ఒకే చెబుతాయా..?లేదా..? అనేది తెలియాల్సి ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడకముందు ట్రూఅప్ చార్జీల కోసం పిటిషన్లు వేసేవారు. దీంతో అప్పుడప్పుడు విద్యుత్ బిల్లులు భారీగా వచ్చేవి. కానీ తెలంగాణ వచ్చాక ట్రూఅప్ చార్జీలలను 12 నెలలకు సమానంగా పంచడం మొదలైంది. 2016-17 నుంచి మొత్తానికే వసూలు చేయడం మానేశారు.అయితే ఇప్పుడు ఆ ఐదేళ్లకు సంబంధించిన చార్జీలను వసూలు చేయాలని చూస్తున్నారు. రూ. 35 వేల కోట్ల ట్రూ అప్ పిటిషన్ వేస్తే ..దానిపై లిఖిత పూర్వకంగా అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఆ తరువాతే విద్యుత్ సంస్థలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నియంత్రించుకోవడానికి వీల్లేని కారణాలను ప్రామాణికం చేసుకొని వేసిన పిటిషన్లనే ఈఆర్సీలు పరిగణలోకి తీసుకుంటాయి.

ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్లో 2019 కు ముందు నాలుగేళ్ల కాలానికి ట్రూ అప్ చార్జీలు వసూలు చేసుకోడానికి అనుమతి ఇవ్వాలని అడిగారు. అప్పుడు రూ.21,500 కోట్లకు నష్టం లెక్కజెప్పి అందులో రూ.18 వేల కోట్ల వసూలుకు అనుమతి కోరారు. అయితే సహేతుకమైన కారణాలు లేవని, ఈఆర్ సీ అనుమతి నిరాకరించింది. కేవలం రూ.3700 కోట్లు వసూలు చేసుకోవాలని అనుమతి ఇచ్చింది. దీంతో ఏపీలోని విపక్షాలు ఆందోళన చేశాయి.

దీంతో సర్కారు 2019-20 సంవత్సరానికి రూ.36 వేల కోట్లు మిగిలాయని పిటిషన్లు వేయడంతో మొదట పేర్కొన్న రూ.3 వేల కోట్ల భారం పడకుండా ఆగిపోయింది. ఏపీలో ప్రతీ మూడు నెలలకోసారి ట్రూ అప్ పిటిషన్లు వేయడానికి అనుమతి ఉంది. ఇందులో భాగంగా 2022-23 ఏఆర్ఆర్ ను ఈఆర్సీకి ఇచ్చినప్పుడు ట్రూ అప్ చార్జీలు మరో రూ.9222 కోట్ల మేర వసూలు చేసుకునేందుకు విద్యుత్ సంస్థలు సిద్ధమయ్యాయి. తెలంగాణ డిస్కమ్ లను కూడా ఈఆర్ సీ 2019-20, 2020-21 సంవత్సరానికి ట్రూ అప్ పిటిషన్లు వేసుకోవలని ఇదివరకే సూచించింది. తాజాగా ఐదు సంవత్సరాలకు సంబంధించిన మొత్తాన్ని వసూలు చేస్తాననడంతో విద్యుత్ వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.