Begin typing your search above and press return to search.

షాకింగ్: ఐసీఎంఆర్‌ శాస్త్రవేత్తకు వైరస్ పాజిటివ్‌ !

By:  Tupaki Desk   |   1 Jun 2020 2:00 PM GMT
షాకింగ్: ఐసీఎంఆర్‌ శాస్త్రవేత్తకు వైరస్ పాజిటివ్‌ !
X
ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రీస‌ర్చ్ ‌(ఐసీఎంఆర్ ‌) కు చెందిన సీనియర్‌ శాస్త్ర‌వేత్త‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఐసీఎంఆర్ శాస్త్రవేత్తల్లో కలకలం రేగింది. వైరస్ కోర్ టీమ్ ‌లో పనిచేస్తున్న ఓ శాస్త్రవేత్తకు సోమవారం ఉదయం కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయినట్లు ఐసీఎంఆర్ అఫీసియల్ వాట్సాప్ గ్రూపులో సందేశం వచ్చింది. దీనితో ఢిల్లీలోని ఐసీఎంఆర్ భవనాన్ని రెండు రోజుల పాటు మూసివేస్తున్నామని. శాస్త్రవేత్తలు ఇంటి నుంచే పనిచేయాలని సూచించారు.

ఈ శాస్త్రవేత్త ముంబై నుంచి రెండు రోజుల కిందట ఢిల్లీకి వచ్చారు. ఆదివారం జ్వరం లక్షణాలతో బాధపడుతున్న ఆయన నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించారు. పరీక్షా ఫలితాల్లో పాజిటివ్‌గా తేలడంతో ఐసీఎంఆర్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఐసీఎంఆర్‌ కు చెందిన నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఫ‌ర్ రీసెర్చ్ ఇన్ రీప్రొడక్టివ్ హెల్త్‌, ముంబై‌లో ఆ శాస్త్రవేత్త ప‌నిచేస్తున్నారు.

ఢిల్లీలోని ప్రధాన కార్యాల‌యం లో ఐసీఎంఆర్ చీఫ్ డాక్టర్ బలరాం భార్గవతో గత వారం జ‌రిగిన స‌మావేశానికి ఆయ‌న హాజ‌ర‌య్యారు. ఆయ‌న ఎవ‌రెవ‌రినీ కాంటాక్ట్ అయ్యారనే వివరాలను ట్రేసింగ్ చేసి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇకపోతే, దేశంలో కరోనా కేసులు 1.90 లక్షలు దాటాయి. ప్రపంచంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదైన దేశాల జాబితాలో భారత్ ఏడో స్థానానికి ఎగబాకింది.