Begin typing your search above and press return to search.

కోట్ల ఏళ్లుగా ఉన్న వందేళ్ల జీవిత కాల చేప జాతి కనుమరుగు

By:  Tupaki Desk   |   20 Jun 2021 7:07 AM GMT
కోట్ల ఏళ్లుగా ఉన్న వందేళ్ల జీవిత కాల చేప జాతి కనుమరుగు
X
సాదారణంగా చేపల జీవిత కాలం 5 నుండి 20 ఏళ్లు ఉంటుంది. కొన్ని రకాల చేప జాతులు మాత్రం 50 ఏళ్ల వరకు జీవితం సాగిస్తాయి. కాని తాజాగా ఫ్రెంచి శాస్త్రవేత్తలు కనిపెట్టిన చేప జాతి మాత్రం వంద ఏళ్లకు పైగా మనుగడ కలిగి ఉంటుందట. ఈ వంద ఏళ్ల జీవిత కాలంలో ఆ చేప 50 నుండి 80 కేజీల వరకు కూడా పెరుగుతుందని వారు గుర్తించారు. ఈ చేప జాతి పేరు కొయెలాకాంత్ అని పేరు పెట్టారు. వారి అధ్యాయం ప్రకారం ఈ చేప జాతి డైనోసర్లు ఉన్నప్పటి నుండి ఉన్నాయట. అంటే 40 కోట్ల ఏళ్ల క్రితం నుండి ఈ చేప జాతి సముద్రంలో ఉన్నాయి. డైనోసర్లు కాల గర్బంలో కలిసి పోయాయి. కాని ఇప్పటికి కొయెలాకాంత్‌ చేపలు మాత్రం మనుగడ సాగిస్తున్నాయి.

డైనోసర్లు మరియు ఇతర పురాతన జీవ రాశితో పోల్చితే కొయెలాకాంత్‌ మాత్రమే ఇప్పటికి ఉన్నాయి. ఈ చేప జాతిపై ప్రయోగాలు చేస్తున్న శాస్త్రవేత్తలు వీటికి శిలాజాలుగా పిలుస్తున్నారు. శిలలు ఎలా అయితే వందల సంవత్సరాలు ఉంటాయో అలాగే ఈ చేప జాతులు కూడా ఉంటాయని వారి అభిప్రాయం. వంద ఏళ్లకు పైగా జీవించే ఈ చేపలు సముద్రం అత్యంత లోతైన ప్రదేశంలో ఉంటాయి. వీటి జీవితంలో ఎప్పుడు కూడా సూర్యరష్మిని చూడవు. చాలా బరువు ఉండే ఈ చేపలు నీటిలో చాలా నెమ్మదిగా కదులుతూ ఉంటాయి.

కొయెలాకాంత్‌ చేపలు యవ్వన దశకు వచ్చేందుకు చాలా ఏళ్ల సమయం పడుతుంది. మగ చేపలు 40 నుండి 70 ఏళ్ల మద్యలో యవ్వన దశకు వస్తాయి. ఇక ఆడ చేపలు 50 ఏళ్ల తర్వాత యవ్వన దశకు వస్తాయి. ఒక చేప అప్పటి వరకు సంతాన ఉత్పత్తి చేయలేదు. కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఈ చేపలు అంతరించి పోయి ఉంటాయని మొదట శాస్త్రవేత్తలు భావించారు. కాని 1938 వ సంవత్సరంలో ఇంకా ఈ చేపలు మనుగడ సాగిస్తున్నాయని గుర్తించారు.

అతి తక్కువ మాత్రమే ఈ చేపలు ఉన్నాయి. కనుక వాటి సంతానం పెరిగి మళ్లీ చేపలు వృద్ది అవ్వడం దాదాపు అసాధ్యం అని అందుకే రాబోయే కొన్ని ఏళ్లలో ఈ జాతి మొత్తం అంతరించి పోతుందని శాస్త్రవేత్తలు నిపుణులు అంటున్నారు. ఈ భూమి మీద మనుగడ సాగిస్తున్న అత్యంత ప్రాచీనమైన జీవ రాశిగా కొయెలాకాంత్ నిలిచింది. రాబోయే రోజుల్లో అది కూడా కనుమరుగయ్యి పోతుంది.