Begin typing your search above and press return to search.

దేశంలోనే అతి పెద్ద స్కాం.. మూలాలు గుజరాత్ లో.. మోడీకి మరో తలనొప్పి

By:  Tupaki Desk   |   13 Feb 2022 4:45 AM GMT
దేశంలోనే అతి పెద్ద స్కాం.. మూలాలు గుజరాత్ లో.. మోడీకి మరో తలనొప్పి
X
కేంద్రంలో కొలువు తీరిన మోడీ సర్కారుకు భారీ షాక్ తగిలినట్లైంది. ఇప్పటికే గుజరాత్ కు చెందిన పారిశ్రామికవేత్తలకు మేళ్లు జరుగుతున్నాయన్న ఆరోపణలు పెద్ద ఎత్తున జరుగుతున్న వేళ.. దేశంలోనే అతి పెద్ద స్కాంకు సంబంధించిన కొత్త విషయాలు వెలుగు చూసి సంచలనంగా మారాయి. ఇప్పటికే బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టిన వారిలో విజయ్ మాల్యా.. నీరవ్ మోడీలతో అగ్రస్థానంలో నిలవటమే కాదు.. విచారణ సంస్థలకు చిక్కకుండా వారు తప్పించుకుంటున్న వైనంపై దేశ ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉండటం తెలిసిందే.

ఇదిలా ఉంటే..తాజాగా గుజరాత్ లో దేశంలోనే అతి పెద్ద స్కాం ఒకటి బయటకు వచ్చి.. సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన విషయాలు కొద్దికొద్దిగా బయటకువస్తున్నాయి. దాదాపు రూ.23 వేల కోట్లకు పైగా ఎగవేసిన బండారం బయటకు వచ్చింది.

గుజరాత్ కు చెందిన ఏబీజీ షిప్ యార్డు లిమిటెడ్ ప్రధాన నిందితుడి పాత్రను పోషిస్తోంది. ఇంతకీ ఈ సంస్థ ఏం చేస్తుందన్న విషయంలోకి వెళితే.. నౌకల తయారీ.. రిపేర్లను చేస్తుంటుంది. గుజరాత్ లోని సూరత్ లో ఉన్న యార్డుల నుంచి ఇప్పటివరకు 165 నౌకల్ని తయారు చేశారు. ఈ కంపెనీ మొత్తంగా 28 బ్యాంకులకు టోకరా చేసినట్లుగా చెబుతున్నారు.

ఈ సంస్థ చేతికి చిక్కి అడ్డంగా బుక్ అయిన బ్యాంకుల్లో ప్రధాన బాధిత బ్యాంక్ ఐసీఐసీఐ అత్యధికమని చెబుతున్నారు. ఈ బ్యాంక్ నుంచి రూ.7089 కోట్లు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.2925 కోట్లు.. ఐడీబీఐ బ్యాంకు నుంచి రూ.3634 కోట్లు.. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ.1614 కోట్లు.. పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ.1244 కోట్లు.. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కు రూ.1228కోట్ల రుణాలు చెల్లించాల్సి ఉంది.

గడిచిన కొద్ది రోజులుగా ఈ రుణాలు చెల్లించకపోవటంతో బ్యాంకుల ఫిర్యాదుతో సీబీఐ రంగంలోకి దిగినట్లుగా చెబుతున్నారు. ఈ కేసులో ఏబీజీ షిప్ యార్డు కపెంనీకి చెందిన రిషి అగర్వాల్.. ముత్తుస్వామి.. అశ్విని కుమార్ లపై సీబీఐ కేసు నమోదు చేసింది.

బ్యాంకు నుంచి తీసుకున్న భారీ మొత్తాల్ని దుర్వినియోగం చేయటంతో పాటు.. ఆ మొత్తాల్ని దారి మళ్లించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కంపెనీకి గుజరాత్ లోని సూరత్.. దమేజ్ లలో యార్డులు ఉన్నాయి. సీబీఐ దర్యాప్తులో మరిన్ని వివరాలు బయటకు వచ్చే వీలుందన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.