లాంగెస్ట్ లిప్ లాక్ రికార్డు బద్దలు కొట్టిన థాయ్ ల్యాండ్ జంట..!

Mon Nov 28 2022 21:00:01 GMT+0530 (India Standard Time)

The Thai couple who broke the longest lip lock record

ముద్దు అనే భావన ఎదుటి వ్యక్తిపై మనకు ప్రేమను చాటుతుందనడంలో అతిశయోక్తి ఏమి లేదు. మద్దు అనే ఫీలింగ్ కేవలం లవర్స్.. కపుల్స్ మధ్య ఉండేది కాదు.. ప్రేమ.. అభిమానం ఉండే అన్ని బంధాల్లోనూ ఉంటుంది. ముద్దుగా ఎవరు పలుకరించినా.. దగ్గరికి తీసుకొని ముద్దు చేసినా ఆ ఫీలింగ్ లో వచ్చే కిక్కే వేరుప్పా.పాశ్చత్య దేశాల్లో ముద్దు సంస్కృతి ఎప్పటి నుంచో ఉంది. మన దేశంలో బహిరంగ ముద్దులు పెట్టుకోవడం అనే కల్చర్ ఇంకా లేదు కానీ ఇప్పుడిప్పుడే పాశ్చాత్య పోకడలు మాత్రం విరివిరిగా వస్తున్నాయి. అయితే ముద్దుల్లోనూ చాలా రకాలు ఉన్నాయి. చిన్న పిల్లలకు పెట్టే ముద్దు.. ప్రియురాలి అలకను తీర్చేందుకు పెట్టే ముద్దు.. యవ్వనంలో ప్రేమను తెలియజేసేందుకు పెట్టే ముద్దు ఇలా రకరకాలు ఉన్నాయి.

మన సినిమాల్లోనూ ముద్దు సీన్లు.. పాటలకు కొదువే లేదు. బాలీవుడ్లో తెరకెక్కే రోమాంటిక్ సీన్లలో ముద్దు సీన్లకు కొదువ లేదు. ఇటీవలీ కాలంలో లిప్ లాక్ సీన్లు సినిమాల్లో కామన్ అయిపోయాయి. సెన్సార్ బోర్డు సైతం వీటికి కత్తెరలు వేయకపోవడంతో ప్రతీ రొమాంటిక్ సినిమాలోనూ లిప్ లాక్ లు కామన్ అయిపోయాయి. ఈ ముద్దు డిస్కషన్స్ ఇప్పుడు ఎందుకంటే..!

ఇటీవలే ఓ థాయ్ లాండ్ జంట ప్రపంచంలో ఇప్పటివరకు ఉన్న అత్యంత సుదీర్ఘమైన లిప్ కిస్ రికార్డును బ్రేక్ చేసింది. లాంగెస్ట్ లిప్ కిస్ రికార్డును ఆ జంట తమ పేరు నమోదు చేసుకొని సరికొత్త గిన్నిస్ బుక్ ను నమోదు చేయడంతోపాటు రెండు డైమండ్ రింగ్స్ ను బహుమతులుగా గెలుచుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన లిప్ లాప్ రికార్డు థాయ్ ల్యాండ్ పేరు మీద ఉంది. 2013 సంవత్సరంలో ఓ జంట రెండ్రోజులకు పైగా ముద్దు పెట్టుకొని రికార్డు సృష్టించారు. ఇప్పుడా రికార్డును అదే దేశానికి చెందిన ఎకాసి.. లక్సానా జంట బ్రేక్ చేసింది. వీరిద్దరు అక్షరాల 58 గంటల 35 నిమిషాల 58 సెకన్ల పాటు లిప్ లాక్ చేసుకుని గిన్నిస్ రికార్డు నెలకొల్పారు.

పట్టాయ నగరంలో ఈ ఏడాది వాలంటైన్స్ డే సందర్భంగా ఓ సంస్థ ముద్దుల పోటీని నిర్వహించగా తొమ్మిది జంటలు పాల్గొన్నాయి. వీరిలో ఎకాసి... లక్సానా జంట అందరినీ వెనక్కి నెట్టి లాంగెస్ట్ లిప్ లాక్ రికార్డును సొంతం చేసుకుంది. అయితే ఈ రికార్డు కోసం వీరిద్దరు పెదవుల్నీ 58 గంటల 35 నిమిషాల 58 సెకన్ల పాటు అంటి పెట్టుకునే ఉన్నారు.

స్ట్రా ద్వారా ద్రవ పదార్థాలను ఆహారంగా తీసుకున్నారు. ఇక బాత్రూం వెళ్లినప్పుడు కూడా వీరిద్దరు పెదవులను మాత్రం వదల్లేదు. అంతలా కష్టపడ్డారు కనుకే ఈ జంట లాంగెస్ట్ లిప్ లాక్ రికార్డును సొంతం చేసుకోగలిగింది. ఈ జంటకు గిన్నిస్ బుక్ నిర్వాహకులు పత్రాన్ని సైతం అందజేశారు. అంతేకాకుండా ఈ రికార్డు మరో పదేళ్ళు చెక్కు చెదిరే అవకాశం లేదని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.