Begin typing your search above and press return to search.

ఏమిటీ మంకీ పాక్స్.. ఎందుకొస్తుందో చెప్పి షాకిచ్చిన తాజా రిపోర్టు

By:  Tupaki Desk   |   24 May 2022 5:21 AM GMT
ఏమిటీ మంకీ పాక్స్.. ఎందుకొస్తుందో చెప్పి షాకిచ్చిన తాజా రిపోర్టు
X
కరోనాకు ముందు.. ఏదైనా వైరస్ వ్యాప్తి చెందుతుందంటే.. ప్రపంచం పెద్దగా పట్టించుకునేది కాదు. చాలా పరిమితంగానే స్పందన ఉండేది. కానీ.. కరోనా అలాంటి తీరును మార్చేయటమే కాదు..ఏదైనా కొత్త వైరస్ వస్తుందంటే చాలు.. ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్నారు.

ప్రపంచంలోని ఏ మూల కొత్త వైరస్ జాడ కనిపించినా.. అది తమనేం చేస్తుందన్న భయాందోళనలు ఈ మధ్య ప్రపంచ దేశాల్లో వ్యక్తమవుతోంది. తాజాగా మంకీ పాక్స్ ఇప్పుడో పెద్ద గండంగా మారటం తెలిసిందే. ఈ కొత్త వైరస్ గురించి బ్రిటిష్ ఆరోగ్య రక్షణ సంస్థ తాజాగా షాకింగ్ నిజాల్ని వెల్లడించింది.

ఆఫ్రికా.. మధ్య.. పశ్చిమ ప్రాంతాల్లో కోతుల్లో కనిపించే ఈ వ్యాధి అక్కడి నుంచి ఐరోపా.. బ్రిటన్ దేశాలకు పాకింది. ఇప్పటికే బ్రిటన్.. ఐరోపా.. అమెరికా.. కెనడా.. ఇజ్రాయెల్.. ఆస్ట్రేలియా దేశాల్లో పలు కేసులు నమోదయ్యాయి. సాధారణంగా కోతుల్లో కనిపించే ఈ వైరల్ వ్యాధి మనుషులకు సోకే అవకాశాలు చాలా తక్కువ. అయితే.. ఈ వైరస్ లైంగిక క్రియ ద్వారా సోకుతున్నట్లుగా గుర్తించారు.

ఈ మధ్యన స్పెయిన్.. బెల్జియం లో జరిగిన రెండు రేవ్ పార్టీల్లో పాల్గొన్న స్వలింగ సంపర్కులు.. ద్విలింగ సంపర్కులైన పురుషలకు మంకీ పాక్స్ ఒకరి నుంచి మరొకరికి సంక్రమించి ఉంటుందన్న విషయాన్ని బ్రిటన్ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

బ్రిటన్ లో ఇప్పటివరకు వెలుగు చూసిన కేసుల్లో చాలా వరకు స్వలింగ సంపర్కుల్లోనే కనిపించినట్లుగా వెల్లడించారు. ఇలాంటి వారితో లైంగిక క్రియ జరిపినా.. పీపీఈ సూట్లు లేకుండా వారి దుప్పట్లు మార్చినా.. వారికి దగ్గరగా వెళ్లినా మంకీపాక్స్ సోకుతుందంటున్నారు.

ఈ వ్యాధి లక్షణాల్ని చూస్తే..
- ఈ వ్యాధి పిల్లల్లో తీవ్రత ఎక్కువగా.. పెద్దల్లో తక్కువగా కనిపిస్తోంది.
- ఒళ్లు నొప్పులు.. చర్మం మీద బొబ్బలు ప్రధాన లక్షణాలు
- తీవ్రమైన జ్వరం కూడా ఉంటుంది
- మంకీపాక్స్ కోవిడ్ మాదిరి కాదు.. అది గాలి ద్వారా వ్యాపించదు. దాన్ని కట్టడి చేసే టీకాలు ఉన్నాయి.
- ప్రస్తుతం మంకీపాక్స్ సోకిన వారికి దగ్గరగా వెళ్లిన వారికి మశూచి టీకాలు ఇస్తున్నారు.