ఆధారాలు లేకుండా ఫిర్యాదులు చేస్తే అంతే సంగతులు

Tue Oct 20 2020 23:01:01 GMT+0530 (IST)

That's all there is to making complaints without evidence

న్యాయవ్యవస్ధలోని జడ్జీలపై వచ్చే ఎటువంటి ఫిర్యాదులను కూడా తీసుకోకూడని హైకోర్టు రిజిస్ట్రార్ ప్రకటించారు. జడ్జీలపై చేసే ఫిర్యుదుల విషయంలో మార్గదర్శకాలను విడుదల చేసింది హైకోర్టు. సుప్రింకోర్టు జడ్జితో పాటు హైకోర్టులోని కొందరు జడ్జీలపై జగన్మోహన్ రెడ్డి సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డేకి ఫిర్యాదు చేసిన నేపధ్యంలో హైకోర్టు రిజిస్ట్రార్ చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకున్నది. తగిన ఆధారాలు లేకుండా ఫిర్యాదు పేరు సంతకం లేకపోతే ఎటువంటి ఫిర్యాదును అయినా ఎంటర్ టైన్ చేయకూడదని రిజిస్ట్రార్ స్పష్టంగా చెప్పారు. ఇదే సందర్భంలో ఫిర్యాదులు చేసే వాళ్ళు తమ ఐడెంటిని చెప్పటంతో పాటు అందుకు ఆధారాలతో పాటు తాము చేస్తున్న ఫిర్యాదులపై ప్రమాణపత్రం (అఫిడవిట్) కూడా ఇవ్వాల్సిందేనంటూ చెప్పారు.మార్గదర్శకాలు పాటించకుండా వచ్చే ఎటువంటి ఫిర్యాదులను కూడా తీసుకునేందుకు లేదని కూడా రిజిస్ట్రార్ చెప్పేశారు. అయితే వచ్చిన ఫిర్యాదులోని అంశాల ప్రాతిపదికగా చీఫ్ జస్టిస్ తన విచక్షణ ఉపయోగించి ఫిర్యాదును తీసుకునేది లేనిది నిర్ణయించే అవకాశం అయితే ఉంది. అదికూడా ఫిర్యాదులో సంస్ధ కార్యాలయం ప్రయోజనాలు ఉన్నాయని భావిస్తే విచారణకు స్వీకరించటమో లేకపోతే విచారణకు ఆదేశించటమో చీఫ్ జస్టిస్ చేస్తారని మార్గదర్శకాల్లో ఉంది. ఫిర్యాదు తప్పని తేలితే అందుకు అవసరమైన అపరాధరుసుమును ఫిర్యాదుదారుడి నుండే వసూలు చేస్తారు.

న్యాయవ్యవస్ధలోని వివిధ స్ధాయిల్లో పనిచేస్తున్న వ్యక్తులపై వచ్చే నిరాధార ఆరోపణలను నియంత్రించటానికి కేంద్రప్రభుత్వం 2014 2017లో జారీ చేసిన మార్గదర్శకాలకు అదనంగానే హైకోర్టు రిజిస్ట్రార్ తాజా ఆదేశాలను జారీ చేశారు. జగన్ చేసిన ఫిర్యాదుల తర్వాత వివిధ సెక్షన్ల నుండి న్యాయవ్యవస్ధలోని వాళ్ళపై ఫిర్యాదులు వెల్లువెత్తుతాయన్న అనుమానంతోనే సుప్రింకోర్టు హైకోర్టు పై మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసినట్లు అనుకుంటున్నారు.