Begin typing your search above and press return to search.

వచ్చేసింది 5జీ విప్లవం.. దేశంలో హైస్పీడ్ ఇంటర్నెట్ షురూ

By:  Tupaki Desk   |   1 Oct 2022 9:26 AM GMT
వచ్చేసింది 5జీ విప్లవం.. దేశంలో హైస్పీడ్ ఇంటర్నెట్ షురూ
X
దేశ టెలికాం రంగంలో కొత్త శకం మొదలైంది. దేశంలో 5 జీ సేవలను ప్రధానమంత్రి నరేంద్రమోడీ శనివారం ప్రారంభించాడు. ఢిల్లీ ప్రగతి భవన్ మైదాన్లో 6వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ -2022 కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని.. దీంతోపాటు 5జీ సేవలకు శ్రీకారం చుట్టారు. ఈ శనివారం నుంచి దేశంలో 5 జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

5జీ సేవల సామర్థ్యాన్ని డెమోను రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ స్వయంగా మోడీకి వివరించారు. ఆ తర్వాత 5జీ సేవల పనితీరును మోడీ స్వయంగా పరిశీలించారు. ఇప్పటికే అమెరికా, చైనా, దక్షిణ కొరియా, ఐరోపాలోని కొన్ని దేశాల్లో 5జీ అందుబాటులోకి వచ్చింది. అక్కడ ఈ సేవలు కొన్ని పట్టణాలకే పరిమితమయ్యాయి. మన దేశంలో తాజాగా లాంచ్అయ్యింది.

-దేశంలో ఏఏ నగరాల్లో 5జీ సేవలు
దేశంలో తొట్టతొలుత 5జీ సేవలను ఎంపిక చేసిన 13 నగరాల్లో ప్రారంభించారు. వచ్చే కొన్నేళ్లలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తారు. తొలి దశలో అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై , ఢిల్లీ, గాంధీనగర్, గురుగ్రామ్, హైదరాబాద్, జామ్ నగర్, కోల్ కతా, లక్నో, ముంబై, ఫుణే నగరాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఇందులో ప్రస్తుతం నాలుగు నగరాల్లో టెలికాం సంస్థలు నేటి నుంచే 5జీ సేవలను ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది.

-5జీ తో లాభాలేంటి?
మానవ జీవనంలో 5జీ తో అనూహ్య మార్పులు వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఇది 4వ పారిశ్రామిక విప్లవంగా చెప్పొచ్చు. ఎంత పెద్ద సినిమానైనా 5జీ ఇంటర్నెట్ ఉంటే ఒక్క క్లిక్తో ఫోన్లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అంతరాయం లేకుండా గేమ్స్ ఆడవచ్చు. కృతిమమేథ, ఇంటర్నెట్ , పర్చువల్రియాల్టీ లాంటి ఆధునిక పరిజ్ఞానానికి 5జీ ఎంతో ఉపకరిస్తుంది. ఆఫీసు నుంచే ఇంట్లోని పనులను ఆన్ లైన్ ద్వారా చేయవచ్చు. ఇంటర్నెట్ ను ప్రస్తుతం 4జీ స్పీడు కంటే 10 రెట్ల వేగంతో బ్రౌజ్ చేయవచ్చు. డ్రైవర్ లేని కార్లను తయారు చేయవచ్చు. మారు మూల ప్రాంతాలకు ఆధునిక వైద్యాన్ని 5జీతో అందించవచ్చు. వ్యవసాయం, బ్యాంకింగ్ సేవలు మరింతగా సులభతరం అవుతాయి. ఆన్ లైన్ చదువుల్లో విప్లవాత్మక మార్పులకు అవకాశం.

-4జీ ఫోన్లను 5జీలోకి మార్చుకోవడం సాధ్యమా?
4జీ ఫోన్లు ఉంటే 5జీలోకి మార్చలేదు. కొత్తగా 5జీ ఫోన్ కొనాల్సిందే. ఎందుకంటే 5జీలో ప్రత్యేక సాఫ్ట్ వేర్, మోడెమ్, ప్రొసెసర్ వాడుతారు. సో 4జీని 5జీలోకి మార్చడం కుదరదు. మార్కెట్లో ఇది కానిపని. కాబట్టి కొత్తగా 5జీ ఫోన్ కొనడం ఉత్తమం.

-5జీ రేట్లు గా భారీగానే ఉండనున్నాయి..
అధికారికంగా 4జీ రేట్లు ఇప్పుడు నెలకు రూ.220 నుంచి 666 వరకూ ఉన్నాయి. 5జీ డేటా వేగం బాగా ఉండడంతో ధర కూడా భారీగా ఉండనుంది. స్పీడ్ ఆశిస్తున్న కస్టమర్లు ఆ మేరకు రేట్లు కూడా భరించాల్సి ఉంటుంది.

అయితే ఇప్పటికిప్పుడు ఈ 5జీ దేశవ్యాప్తంగా రావడం కష్టమే. 5జీ టవర్లకు భారీ ఖర్చు అవసరం. సో హైదరాబాద్, ఢిల్లీ , ముంబై, చెన్నై, కోల్ కతాలాంటి మహా నగరాల్లోనే ఈసేవలు రావచ్చు. మనవరకూ రావడానికి టైం పడుతుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.