36 పరుగులకే ఆలౌట్ అయిన అర్థరాత్రి అలా జరిగిందట

Sun Jan 24 2021 05:00:02 GMT+0530 (IST)

That's what happened in the middle of the night when he was all out for 36 runs

ఏళ్లకు ఏళ్లుగా సాగుతున్న పరంపరకు చెక్ చెప్పి.. కొత్త చరిత్రను క్రియేట్ చేయటం అంత తేలికైన విషయం కాదు. ఆసీస్ ను వారి గడ్డ మీదనే ఓటమిపాలు చేయటం అంత సలువైన విషయం కాదు. అదే ఇప్పుడు టీమిండియా జట్టు మీద ప్రశంసల వర్షం కురిపిస్తోంది. 36 పరుగులకే ఆలౌట్ అయిన జట్టేనా? ఆసీస్ ను ఓటమి పాలు చేసిందన్నది ఇప్పుడు చర్చగా మారింది. స్వల్ప స్కోర్ కు ఆలౌట్ అయిన జట్టు.. తిరిగి పుంజుకొని టెస్టుసిరీస్ ను 2-1 తేడాతో గెలవటం హాట్ టాపిక్ గా మారటమే కాదు.. టీమిండియా జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది.ఈ అద్భుత చారిత్రక విజయానికి నాంది 36 పరుగులకు ఆలౌట్ అయిన రోజు అర్థరాత్రి అని చెబుతున్నారు. ఈ ఆసక్తికర విషయాన్ని ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ చెప్పుకొచ్చారు. ఆ రోజు అర్థరాత్రి కోచ్ రవిశాస్త్రి.. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్.. బౌలింగ్ కోచ్ అరుణ్ లు సమావేశమయ్యారు. అదే సమయంలో కోహ్లీ నుంచి ఏం చేస్తున్నారన్న సందేశం శ్రీధర్ కు వచ్చింది. అందరం మాట్లాడుకోవటానికి కూర్చున్నామని రిప్లై ఇస్తే.. తానుకూడా జాయిన్ కావచ్చా? అని అడగటం.. ఆ తర్వాత అందరూ కలిసి మిషన్ మెల్ బోర్న్ ను షురూ చేశారట.

36 పరుగుల్ని ఒక బ్యాడ్జిలా ధరించాలని.. అదే టీమిండియాను అత్యుత్తమ జట్టుగా మారుస్తుందని కోచ్ రవిశాస్త్రి నమ్మారట. ఘోర వైఫల్యం తర్వాత ఆడిలైట్ టెస్టుకు సమయం ఉన్నా.. టీం సభ్యులతో సాధన చేయించకుండా.. చిన్న చిన్న సరదా ఆటలు ఆడించారు. అదే సమయంలో జట్టులోనూ కొన్ని మార్పులు చేశారు. ఎడమ చేతి వాటం ఉన్న బౌలర్లను ఎంపిక చేశారు.

తొలి టెస్టులో బ్యాటింగ్ విఫలమైతే.. దాన్ని మార్చకుండా.. బౌలింగ్ ను మార్చటం.. అది కూడా ఎడమ చేతి బౌలర్లను ఎంపిక చేశారు. మెలో బోర్న్ లో టాస్ గెలిస్తే.. బ్యాటింగ్ ఎంచుకోవాలని టీమిండియా అనుకున్నారు. టాస్ ఓడిపోవటం.. ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. గత ఐదు మ్యాచుల్లో ఎవరైతే తొలుత బ్యాటింగ్ చేస్తారో వారే మ్యాచ్ గెలుస్తున్నారు. ఇలాంటి సమయంలో.. రవిశాస్త్రి రోటీన్ కు భిన్నంగా ఆలోచించారు. తొలుత ఫీల్డింగ్ చేసి గెలిచిన జట్టు ఏదైనా అప్పటివరకు ఉందేమోనని కనుక్కోమన్న ఆయన.. ఆశ్విన్ కు పది ఓవర్ల లోపే బౌలింగ్ చేయాలని చెప్పారట.

ఆ నిర్ణయానికి అశ్విన్ సైతం ఆశ్చర్యపోయారట. అయితే.. అనుకోని రీతిలో మొదటి బంతే చక్కగా బౌన్స్ కావటంతో తాను మరింత ఆశ్చర్యపోయినట్లుగా చెబుతున్నారు.అనంతరం దూసుకెళ్లటం.. ప్లాన్ సూపర్ సక్సెస్ కావటం.. చారిత్రక విజయం సొంతమైంది.