Begin typing your search above and press return to search.

అమెరికాలో తెలుగోడి ఘనత.. ఎయిర్ ఫోర్స్ లో కీలక పదవి..!

By:  Tupaki Desk   |   28 Jan 2023 5:00 AM GMT
అమెరికాలో తెలుగోడి ఘనత.. ఎయిర్ ఫోర్స్ లో కీలక పదవి..!
X
ప్రవాస భారతీయులు ఏ దేశంలో ఉన్నా అక్కడ సత్తా చాటుతూనే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏ రంగంలో చూసినా మన భారతీయులే కీలక పదవుల్లో ఉంటున్నారు. ఈ జాబితాలో మన తెలుగువాళ్లకు కొదవేమీ లేదు. తాజాగా భారత అమెరికన్.. తెలుగు వ్యక్తి రాజాచారి అమెరికాలో ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. దీంతో ఆయన పేరు అమెరికాతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ మార్మోగిపోతోంది.

రాజాచారి తండ్రి శ్రీనివాస్ వి.చారి హైదరాబాద్ కు చెందిన వ్యక్తి. అయితే ఉన్నత విద్య.. ఉద్యోగం కోసం అమెరికాకు వలస వెళ్లి అక్కడే స్థిరపడిపోయారు. అమెరికాకు చెందిన పెగ్గీ ఎగ్బర్ట్ ను ఆయన వివాహం చేసుకున్నాడు. వీరికి 1977లో రాజాచారి జన్మించాడు. ఈ క్రమంలోనే రాజాచారి స్కాన్సిన్ లోని మిల్వాకీలో ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు.

అనంతరం యూఎస్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఆస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత యూఎస్ నావల్ టెస్ట్ పైలట్ స్కూల్లోనూ విద్యను పూర్తి చేవాడు. 2017లో నాసా ఆస్ట్రోనాట్ క్యాండిడేట్ క్లాస్ కు ఎంపికయ్యాడు. 2021లో నాసా స్పేస్ ఎక్స్ సంయుక్తంగా ప్రయోగించిన క్రూ-3 మిషన్ లో రాజాచారి ఒకడిగా ఉన్నాడు. ఫాల్కన్ 9 రాకెట్ లో ప్రయాణించిన నలుగురు వ్యోమగాములకు రాజాచారి కమాండర్ గా వ్యవహరించడం విశేషం.

కొన్నినెలల పాటు అంతరిక్ష కేంద్రంలో పరిశోధనలు జరిపిన వ్యోమగాముల బృందం గతేడాది మే నేలలో భూమికి తిరిగి వచ్చింది. రాజాచారి తొలి అంతరిక్ష ప్రయోగం కూడా ఇదే కావడం గమనార్హం. మరోవైపు చంద్రుడిపై అన్వేషణ చేపడుతున్న ‘ఆర్టెమిస్’ మిషన్ కోసం నానా 18 మందిని ఎంపిక చేసింది. ఇందులో రాజాచారి ఒకరు. అంతా సజావుగా సాగితే 2024లో రాజాచారి చందమామపై కాలుమోపే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలోనే రాజాచారి అమెరికాలో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అమెరికా ఎయిర్ ఫోర్స్ లో బ్రిగేడియర్ జనరల్ గ్రేడ్ పదవీకి రాజాచారిని అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ నామినేట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను యూఎస్ రక్షణ శాఖ తాజాగా విడుదల చేసింది. అయితే ఈ నామినేషన్ ను సెనేట్ ఆమోదించాల్సి ఉంది.

అమెరికా ఎయిర్ ఫోర్స్ లో బ్రిగేడియర్ జనరల్ అనే ది వన్ స్టార్ జనరల్ ఆఫీసర్ ర్యాంక్. దీని తర్వాత మేజర్ జనరల్ హోదా ఉంటుంది. 45 ఏళ్ల రాజాచారా అమెరికా వైమానిక దళంలో కల్నల్ హోదాలో ఉన్నారు. నాసాలో వ్యోమగామిగా.. క్రూ 3 కమాండర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవలే రాజాచారి తన తొలి అంతరిక్షయాత్రకు పూర్తి చేసుకున్నాడు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.