అసలు సిసలు కాటన్ జీన్స్ కేరాఫ్ కమలాపూర్

Thu Oct 28 2021 11:51:59 GMT+0530 (IST)

Telangana region opened cotton jeans in the market

ఫ్యాషన్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది జీన్స్. దాదాపు నలభై ఏళ్ల క్రితం జీన్స్ అన్నది మన దగ్గర లేదు. కానీ.. ఈ రోజున జీన్స్ లేని ఇల్లు అన్నదే దేశంలో ఉండదు. అంతలా మనకు పట్టేసిన జీన్స్ ను.. మనకు తగ్గట్లు మార్చుకోవటానికి ఇప్పటి వరకు చాలా నే ప్రయత్నాలు జరిగాయి. తాజాగా అందు లో మరో ఘనత ను సాధించారు మనోళ్లు. అవును.. కాటన్ జీన్స్ ను.. మగ్గం మీద నేయటం ద్వారా కొత్త మార్కెట్ కు తెర తీశారు తెలంగాణ ప్రాంతానికి చెందిన చేనేతలు.ఉత్పత్తి వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తూ.. నిపుణుల తో సలహాలు.. సూచనలు ఇవ్వటం తో పాటు ప్రత్యేక శిక్షణ ఇప్పించటం తో ఇది సాధ్యమైంది. ఇంత కూ దీన్ని సాధించిన వారు ఎవరంటే.. హనుమ కొండ జిల్లా లోని కమలాపురం చేనేతన్నలు. మార్కెట్లో జీన్స్ కు ఉన్న గిరాకీ ఎంతో తెలిసిందే. అలాంటి ది అసలు సిసలు కాటన్ తో జీన్స్ ను తయారు చేస్తే.. దానికి ఉండే ఆదరణ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ నేపథ్యం లో గడిచిన మూడు నెలలు గా మగ్గం మీద కాటన్ జీన్స్ ను నేయటం నేర్చుకున్న నేతన్నలు వీటి ని పెద్ద ఎత్తున తయారు చేస్తున్నారు. ఈ కాటన్ జీన్స్ కు మార్కెట్ లో ఆదరణ ఉండటం తో హైదరాబాద్ కు చెందిన పలు షాపుల వారు ప్రత్యేకం గా ఆర్డర్ ఇచ్చి మరీ తయారు చేయిస్తున్నారు. అసలు సిసలు కాటన్ జీన్స్ కు కేరాఫ్ గా కమలా పురం మారిందని చెబుతున్నారు. ధరించేందుకు ఎంతో అనువు గా ఉండే ఈ జీన్స్ ను వాడటం మొదలు పెడితే.. మరే జీన్స్ ను వాడలేరని చెబుతున్నారు. ఇక.. ఈ కాటన్ జీన్స్ ను మీటరు రూ.300 చొప్పున అమ్ముతున్నట్లుగా వెల్లడించారు.