Begin typing your search above and press return to search.

టాప్ లో తెలంగాణ ..ఏపీ నెంబర్ ఎంతంటే ..?

By:  Tupaki Desk   |   9 Nov 2019 1:30 AM GMT
టాప్ లో తెలంగాణ ..ఏపీ నెంబర్ ఎంతంటే ..?
X
సమైక్యాంధ్ర ప్రదేశ్ నుండి రెండు భాగాలుగా విడిపోయిన తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి లో పోటీ పడాలని అందరూ భావించారు. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తన ప్రయాణాన్ని ప్రారంభిస్తే ... తెలంగాణ అధిక బడ్జెట్ తో తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. దీనితో రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీ పడి .. దేశంలోనే అగ్ర రాష్ట్రాలుగా నిలవాలి అని ప్రతి ఒక్క తెలుగువాడు కోరుకున్నారు . ఇప్పుడు అందరూ కోరుకున్నట్టు గానే తెలంగాణ టాప్ లో , ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్ లో నిలిచింది. కోరుకున్నది అదే కదా ..కోరుకున్నది జరిగినప్పుడు ఆనందపడాలే కానీ , ఈ ఏడుపు ఎందుకు అని అనుకుంటున్నారా .. టాప్ 1 , 2 లో తెలుగు రాష్ట్రాలు నిలిచాయి. కానీ , అది అభివృద్ధి చెందిన రాష్ట్రాలుగా మాత్రం కాదు. మరి ఎందులో అని అనుకుంటున్నారా ? అదేమిటో తెలిస్తే ఏపీ . తెలంగాణ ఇందులో పోటీ పడుతుందా అని ప్రతి ఒక్కరూ అనుకోడం ఖాయం

అదేమిటంటే ... సెంట్రల్ బ్యూరో ఆఫ్ హెల్త్ ఇంటెలిజెన్స్ విడుదల చేసిన నేషనల్ హెల్త్ ప్రొఫైల్ 2019లో విస్మయం గొలిపే వాస్తవాలు బయటపడ్డాయి. లైంగికంగా సక్రమించే వ్యాధుల్లో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో ఉండగా.. ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. 2018లో తెలంగాణలో 14,940 మందికి లైంగిక వ్యాధులు సక్రమించాయి. వీరిలో 4,824 మంది పురుషులు కాగా.. 10,116 మంది స్త్రీలు ఉన్నారు. ఏపీలో 2018లో 12,484 మందికి సెక్సువల్ ఇన్ఫెక్షన్లు వచ్చాయి. అందులో 3,197 మంది పురుషులు కాగా.. 9,287 మంది స్త్రీలు ఉన్నారు. వీరంతా గొనోకొక్కల్ ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు. ఇది లైంగికంగా సక్రమించే బ్యాక్టీరియా ద్వారా వ్యాప్తి చెందుతుంది.

అసురక్షిత శృంగారం, డయాబెటిస్ వ్యాధి బారిన పడటం వలన సుఖ వ్యాధుల బారిన పడిన వారి సంఖ్య తెలంగాణ లో ఎక్కువగా ఉందని చెప్తున్నారు. ఎక్కువగా ఆల్కహాల్ సేవించడం.. మద్యం మత్తులో కండోమ్ లేకుండా సెక్స్‌లో పాల్గొనడం కూడా లైంగిక వ్యాధుల బారినపడ్డ వారి సంఖ్య కారణం అవుతోందని ఆండ్రాలజిస్ట్ అండ్ సెక్సాలజిస్ట్ అయిన డాక్టర్ రాహుల్ రెడ్డి చెప్పారు. లైంగిక వ్యాధుల బారిన పడ్డ వారి లో హెచ్ఐవీ ముప్పు పది రెట్లు పెరుగుతుందని , 15-50 ఏళ్ల మధ్య వయస్కులు లైంగికంగా యాక్టివ్‌గా ఉంటారు. కాబట్టి వీరికే ఎక్కువగా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలిపారు. తెలంగాణ లో 15 శాతం నుంచి 20 శాతం మంది డయాబెటిస్‌తో బాధపడుతున్నారు అని , ఈ డయాబెటిస్‌ కారణంగా వీరు లైంగికంగా సక్రమించే వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువని డాక్టర్లు చెబుతున్నారు.