తెలంగాణ బడ్జెట్ పైనే అందరి చూపు.. ఎన్నికల కోసం వరాలు

Mon Feb 06 2023 10:32:16 GMT+0530 (India Standard Time)

Telangana budget for 2023-24 is likely to exceed 2.85 lakhs

తెలంగాణ బడ్జెట్ (2023-24) ను సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికల ఇయర్ అయినందుకు అందరూ ఈ బడ్జెట్ పై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. సామాన్యులను ఆకట్టుకునేలా ఎలాంటి పథకాలు ప్రకటిస్తారోనని ఎదురుచూస్తున్నారు. ఎన్నో ఒడిదొడుగుల మధ్య ఆమోదం పొందిన బడ్జెట్ ను ఒక నెల ముందుగానే ప్రవేశపెడుతున్నారు. దీంతో త్వరలో తెలంగాణలో ఎన్నికల వాతావరణం ఏర్పడనుందన్న చర్చ సాగుతోంది. అయితే సోమవారం ప్రవేశపెట్టే 2023-24 బడ్జెట్ 2.85 లక్షలు దాటే అవకాశం ఉందని తెలుస్తోంది.



2022-23 బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వం అంచనా లెక్క తప్పిందని అంటున్నారు. అనుకున్న ఆదాయం రాకపోవడంతో కొన్ని సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేయలేదని అంటున్నారు. ముఖ్యంగా దళిత బంద్ పథకానికి 17700 కోట్లు కేటాయించినా ఆ ఆర్థిక సంవత్సరంలో ఒక్క పైసా కూడా నిధులు విడుదల చేయలేదని అర్థమవుతోంది. అలాగే రుణమాఫీ పథకాన్ని కూడా పట్టించుకోలేదని తెలుస్తోంది.

కొత్త బడ్జెట్(2023-24) 2.85 లక్షలు దాటే అవకాశం ఉందని తెలుస్తోంది. వచ్చే కొన్ని నెలల్లోనే ఎన్నికలు జరగనుండడంతో ప్రజలను ఆకర్షించేలా పలు పథకాలు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇప్పటికే ప్రకటించిన వాటికి భారీగా నిధులు కేటాయిస్తారని అనుకుంటున్నారు. దేశమంతా ఆశ్చర్యపడేలా ప్రకటించిన 'దళిత బంద్' కు ఈసారైనా నిధులు కేటాయిస్తారా..? అని అనుకుంటున్నారు.

జాతీయా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కేసీఆర్ దేశమంతా చర్చించుకునేలా కొత్త స్కీంలను తీసుకొస్తారని అంటున్నారు. ఎన్నో రోజుల నుంచి రైతులు ఆశ్చర్యపడేలా కొత్త విధానాన్ని తీసుకొస్తానని అంటున్నారు. ఇందులో భాగంగా ఆసరా పింఛన్ లాగే.. రైతులకు కూడా పింఛన్ పథకాన్ని ప్రకటిస్తారన్న చర్చ సాగుతోంది. ఈ పథకాన్ని దేశ వ్యాప్తంగా పరిచయం చేసి తాము అధికారంలోకి వస్తే ఈ పథకాన్ని దేశమంతా వర్తింపజేసేలా ప్రయత్నిస్తానని చెప్పనున్నాడు.

సామాన్యలు ఎదురుచూస్తున్న మరో పథకం ఖాళీ జాగా ఉంటే రూ.3 లక్షల సాయం చేస్తామని ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. దీనిని ఈసారి ప్రకటిస్తారని అంటున్నారు. గత ఎన్నికల్లో ప్రకటించిన ఈ పథకం కార్యారూపం దాల్చలేదు. అయితే ఈ ఏడాది ఎన్నికలు ఉండడంతో ప్రజలను ఆకర్షించేందుకు దీని అమలుకు హామీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.