షర్మిల దీక్ష అంటే వార్డ్ మెంబర్ కు ఎక్కువ ప్రజలు అంట!

Tue Jul 20 2021 17:11:11 GMT+0530 (IST)

Telangana People Are Not at all Showing Any interest in YSRTP Sharmila Reddy Deeksha

అంత అంటోంది.. ఇంత అంటోంది. కానీ వైఎస్ షర్మిలమ్మ పంచులు పేలినా.. జనాల చప్పట్లు మాత్రం వినపడడం లేదు. ఎంత గొంతు చించుకుంటున్నా.. రోడ్డెక్కుతున్నా.. పట్టుమని పది మంది పెద్ద నేతలు ప్రజలు ఆమె వెంట కానరావడం లేదే అని ఇప్పుడు మథనపడుతున్నారట..ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలనే డిమాండ్ తో వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు ఇవాళ ఖమ్మం జిల్లాలో దీక్షకు దిగారు. ప్రతి మంగళవారం నాడు షర్మిల ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించాలనే డిమాండ్ తో నిరసనకు దిగుతున్న సంగతి తెలిసిందే.

మంగళవారం షర్మిల ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గంగదేవిపాడులో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి నాగేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించారు.  నాగేశ్వరరావు చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకొని అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఈనెల 8న తెలంగాణలో పార్టీ ప్రారంభించిన వైఎస్ షర్మిల తెలంగాణలో తన పర్యటనలు ఉంటాయని సెలవిచ్చారు. అయితే తెలంగాణ జిల్లాల్లో పర్యటిస్తున్నా కనీసం వార్డు మెంబర్ స్థాయి నేతలు కూడా ఆమె పార్టీలో చేరడం లేదట.. ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యే స్థాయి నేతలు అయితే అసలు షర్మిల వైపు కూడా చూడడం లేదట.. వార్డ్ మెంబర్ స్థాయికంటే ఎక్కువమంది ప్రజలు మాత్రమే ఆమె దీక్ష స్థలికి వస్తున్నారట..

షర్మిల దీక్షలకు తెలంగాణ అస్సలు జనాలే కనిపించడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో అమరుల కుటుంబాల వద్ద దీక్ష చేస్తే ఆ ఊరివాళ్లు సైతం రావడం లేదట.. దీంతో మీడియాలో ఫోకస్ కావడానికి హైదరాబాద్ నుంచి వాహనాల్లో జనాలను నేతలను ఆయా గ్రామాలకు తరలించి దీక్షలో కూర్చుండబెడుతున్నారని టాక్. గ్రామంలోని జనాలు రాకపోవడంతో షర్మిల బ్యాచ్ ఈ ఏర్పాట్లు చేసిందని భోగట్టా.

గ్రామ ప్రజలు కూడా రాని షర్మిల దీక్షలు అట్టర్ ఫ్లాప్ అని తెలియకుండా ఉండేందుకు ఇలా చేస్తున్నారని.. మీడియాతో హడావుడి చేస్తున్నారు తప్పితే అసలు ఆమె వెంట నిలబడే ప్రజలే లేరు అని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయా గ్రామాల్లో షర్మిల సభకు జనాలు రావడం లేదని ఫొటోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

మొత్తంగా షర్మిల తీరు చూస్తే పేరు గొప్ప.. ఊరు దిబ్బలా మారిందని.. ఆమె దీక్షలకు అస్సలు తెలంగాణలో జనాలే రావడం లేదని అంటున్నారు. తాజాగా ఖమ్మం జిల్లా పెనుబల్లిలోనూ ఇదే పరిస్థితి కనిపించింటున్నారు. షర్మిల రాజకీయ భవిష్యత్ ఇలా అయితే కష్టమని.. పట్టుమని పది మంది లేకుండా ఆమె ఏం రాజకీయం చేస్తుందని పలువురు ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంది.