తెలంగాణ కొత్త సచివాలయం ఫైనల్ డిజైన్ ఇదేనట

Tue Jul 07 2020 10:30:53 GMT+0530 (IST)

Telangana New Secretariat Building Design Plan

ఏమాటకు ఆ మాట చెప్పుకోవాల్సిందే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకసారి ఫిక్స్ అయితే.. దాన్ని సాధించే వరకూ వెనక్కి తగ్గరు. కారణం ఏమైనా కానీ.. సచివాలయం ఆయనకు నచ్చలేదు. నచ్చని దాని గురించి ఆయన చెప్పే మాటలు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. కేసీఆర్ కు నచ్చని సచివాలయం స్థానే కొత్తదాన్ని కట్టేందుకు వందలాకోట్లు ఖర్చుపెట్టేందుకు వెనుకాడని పరిస్థితి. తాను కోరుకున్న రీతిలో సచివాలయాన్ని సిద్ధమయ్యాక.. అందులోకి అడుగు పెట్టాలన్న ఆలోచనలో చెబుతుంటారు ఆయన సన్నిహితులు.అయితే.. ఈ విషయం మీద సీఎం కేసీఆర్ ఇప్పటివరకూ ఓపెన్ గా తన అభిప్రాయాన్ని చెప్పింది లేదు. మొన్నటివరకూ ఈ నిర్మాణం కూల్చి వేతకు సంబంధించి వ్యాజ్యాలు హైకోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. ఇటీవల సచివాలయం కూల్చివేతకు హైకోర్టు తనకెలాంటి అభ్యంతరాలు లేవని చెప్పింది. ఈ తెల్లవారుజామునే.. సచివాలయాన్ని కూల్చేయటం షురూ చేశారు.

సరిగ్గా ఇదే సమయంలో.. కొత్త సచివాలయానికి సంబంధించిన ఫైనల్ డిజైన్ ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. భారీ నిర్మాణంతో చూసినంతనే కళ్లు చెదిరిపోయేలా కొత్త సచివాలయ డిజైన్ ఉందని చెప్పాలి. మొత్తం మూడు వరుసల్లో గుమ్మటాలు.. మధ్యలో మూడు అంతస్తుల్లో గుమ్మటాలు.. ఫైనల్ గా అత్యున్నత గుమ్మటం ఒకటి ఉండేలా డిజైన్ చేశారు.ఆధునికతతోపాటు.. రాజసం ఉట్టిపడేలా డిజైన్ ఉందని చెప్పాలి.