Begin typing your search above and press return to search.

బీజేపీకి అమ్ముడుపోయారు...కేసీయార్ చుట్టూ మూడు వందల సార్లు...?

By:  Tupaki Desk   |   14 Aug 2022 11:34 AM GMT
బీజేపీకి అమ్ముడుపోయారు...కేసీయార్ చుట్టూ మూడు వందల సార్లు...?
X
మునుగోడు ఉప ఎన్నిక కాదు కానీ నాయకుల తెర వెనక భాగోతాలు అన్నీ గటగటా ప్రత్యర్ధుల నోట అలా వచ్చేస్తున్నాయి. ఒకరి మీద ఒకరు చేసుకుంటున్న ఈ విమర్శలతో వాస్తవాలు ఏమిటో జనాలకు బాగా అర్ధమవుతున్నాయి. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయనగా సడెన్ గా తన పదవికి రాజీనామా చేసి బీజేపీలోకి దూకారు. ఉప ఎన్నికను తెచ్చారు. అయితే రాజగోపాల్ రెడ్డి తన రాజీనామాకు చెబుతున్న కారణాలు అయితే అతికినట్లుగా ఏ మాత్రం లేవు.

నియోజకవర్గంలో అభివృద్ధి జరగడంలేదని చెప్పి ఆయన తెలంగాణాలో ఏ మాత్రం లేని బీజేపీలోకి వెళ్లారు. ఒకవేళ ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చేవారు దూకేదు అధికార పార్టీలో. కానీ రాజగోపాల్ రెడ్డి విచిత్రమైన ప్రకటన చేస్తూ తానున్న పార్టీని వదిలారు. అలాగే తానునన్ చెట్టు కొమ్మను నరకాలని చూశారు. ఆయన ద్రోహి అని ఇప్పటికే కాంగ్రెస్ రచ్చ రచ్చ చేస్తోంది. మునుగోడు అంతటా పోస్టర్లు వేసి మరీ కాంగ్రెస్ రాజగోపాల్ రెడ్డిని టార్గెట్ చేస్తోంది.

ఇపుడు టీయారెస్ కూడా అదే పని మీద ఉంది. మునుగోడులో మీడియాతో మాట్లాడిన టీయారెస్ మంత్రి జగదీశ్ రెడ్డి అయితే రాజగోపాల్ రెడ్డిని ఏకంగా దొంగ అనేశారు. ఆయన బీజేపీకి అమ్ముడుపోయారని కూడా ఘాటు విమర్శలు చేశారు. ఏకంగా 21 వేల కోట్ల కాంట్రాక్టుల కోసమే ఆయన బీజేపీ పంచన చేరారని అన్నారు. అభివృద్ధి లేదు అని బీజేపీలోకి వెళ్తున్నానని చెప్పిన రాజగోపాల్ రెడ్డికి మిషన్ భరీరధ జలాలలో ఫ్లోరైడ్ భాధితులను ఆదుకోవడం కనిపించలేదా అని ప్రశ్నించారు.

తెలంగాణాతో పాటు సొంత నియోజకవర్గంలో టీయారెస్ చేసిన అభివృద్ధి ఆయనకు అసలు కనిపించకపోవడం వెనక కాంట్రాక్టులు, ఒప్పందాలే ఉన్నాయని అన్నారు. టీయారెస్ లో చేరడానికి కూడా ఆఫర్ కోరుతూ ఇదే రాజగోపాల్ రెడ్డి తిరిగారని ఆయన ఆరోపించారు. కాంట్రాక్టులు ఇస్తే చాలు టీయారెస్ లో చేరిపోతాను అని రాజగోపాల్ రెడ్డి కేసీయార్ చుట్టూ మూడు వందల సార్లు తిరిగిన విషయం నిజం కాదా అని జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు.

ఇప్పటిదాకా ప్రజలను మోసం చేస్తూ కోమటి రెడ్డి బ్రదర్స్ నాటకాలు ఆడుతున్నారని, ఇక మీదట అవి చెల్లనేరవని ఆయన కొట్టిపారేశారు. బీజేపీలోకి వెళ్ళిన రాజగోపాల్ రెడ్డి ఎనిమిదేళ్ళలో ప్రజల మీద బీజేపీ మోపిన భారాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గ్యాస్ ధరలతో పాటు నిత్యావసర ధరలను అన్నీ పెంచేసిన బీజేపీకి కొమ్ము కాసిన రాజగోపాల్ రెడ్డి ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు.