యువతి ధైర్యంతో గూగుల్ - పోర్న్ సైట్లకు దెబ్బ

Tue Aug 20 2019 15:47:25 GMT+0530 (IST)

Telangana High Court Serious On Google Over Adult Sites

ఇక యువతి గూగుల్ కే షాకిచ్చింది. పట్టించుకోని గూగుల్ ను న్యాయవ్యవస్థ ద్వారా ఎదుర్కొంది. దీంతో పోర్న్ సైట్లు అన్నింటికి ఎసరు వచ్చేసింది. ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువైంది. లేచినప్పటి నుంచి పడుకునే వరకు సెల్ఫీలు తీసుకునే అందమైన యువతుల సంఖ్య ఎక్కువైంది. ఇక టిక్ టాక్ తో సుందరాంగుల వీడియోలు ఫ్రీగా సోషల్ మీడియాలో దొరికేస్తున్నాయి..ఇదే పరిణామం కొందరు అక్రమార్కులకు వరంగా మారింది. కొందరు ఓ అందమైన యువతి ఫొటోలు - వీడియోలను మార్ఫింగ్ చేసి పోర్న్ వీడియోలతో జత చేసి అశ్లీల వెబ్ సైట్లలో  అప్ లోడ్ చేశారు. ఈ వీడియోను చూసిన సదురు బాధిత యువతి షాక్ తిన్నది. ఘోర అవమానం అని వెంటనే సెర్చింజన్ గూగుల్ కు ఫిర్యాదు చేసింది. అయితే ఈ విషయంలో గూగుల్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

దీంతో తనను బజారుకీడ్చిన పోర్న్ వెబ్ సైట్లు - గూగుల్ పై బాధిత యువతి పోరుబాట పట్టింది. తనకు న్యాయం చేయాలంటూ తాజాగా బాధితురాలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది.

మంగళవారం ఈ ఫిర్యాదుపై హైకోర్టు సీరియస్ గా స్పందించింది. అశ్లీల వెబ్ సైట్ల పూర్తి వివరాలను అందించాలని.. గూగుల్ కూడా దీనిపై సమాధానం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో పోర్న్ వెబ్ సైట్లతోపాటు గూగుల్ కు హైకోర్టు షాకిచ్చినట్టైంది. వివరాలు అందిస్తే వాటన్నింటిపై నిషేధం విధించేందుకు హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించనుంది. యువతి ధైర్యం చేసి బయటకు రావడం గూగుల్ తోపాటు పోర్న్ సైట్లకు శరఘాతంగా మారింది.