కేసీఆర్ టాక్స్ : కాస్త ఆగండి అప్పుడే కాదు !

Sat Jun 25 2022 19:00:01 GMT+0530 (IST)

Telangana Chief Minister KCR

జాతీయ పార్టీ పెట్టాలి అన్న ఉద్దేశంతో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  కాస్త డైలమాలో పడ్డారు. ఇప్పుడే కాదు కొంత కాలం వేచి చూద్దాం అన్న ధోరణిలోనే ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికల తరువాతే పార్టీ పెడితే బాగుంటుంది అన్న ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే జాతీయ పార్టీ పె ట్టే విషయమై ఇంకా కొన్ని వర్గాలతో ఆయన చర్చించాల్సి ఉందని తెలుస్తోంది. అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి లాంటి కాంగ్రెస్ లీడర్లు బాగా దూసుకుపోతున్నారు. కనుక వారిని నిలువరించి రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేశాకనే జాతీయ రాజకీయాలపై ఆసక్తి పెంచుకోవడం అదేవిధంగా కొత్త పార్టీ ప్రారంభించడం వంటి పనులు చేయాలని యోచిస్తున్నారు. వాస్తవానికి ఈ వారంలోనే పార్టీ అనౌన్స్ చేస్తారని అంతా భావించినా కేసీఆర్ వెనక్కు తగ్గారు.రాష్ట్రపతి ఎన్నికలకు మూడు వారాల గడువు ముందుండడంతో అప్పటిదాకా దేశంలో నెలకొన్న విభిన్న స్థితిగతులు రాజకీయ పరిణామాలకు సంబంధించి అధ్యయనం చేయాలని భావిస్తున్నారు.

కనుక ఇప్పటికిప్పుడు జాతీయ పార్టీ పెట్టే తొందరలో అయితే కేసీఆర్ లేరు అని తేలిపోయింది. కాస్త ఆలోచించి నిపుణులతో పదే పదే చర్చించాకే ఇందుకు సంబంధించిన నిర్ణయం ఒకటి వెలువరిస్తారు. అదేవిధంగా ఈసారి ఆయన ముందస్తుకు వెళ్తారు అన్న మాట కూడా అబద్ధమే అని అంటున్నారు. ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ టెర్మ్ కంప్లీట్ చేసుకునే వెళ్లాలని భావిస్తున్నారు.

ముఖ్యంగా రాష్ట్రంలో కేసీఆర్ పై వ్యతిరేకత ఉందన్న వాదనలు వినిపిస్తున్న తరుణాన జాతీయ పార్టీ ప్రకటన అన్నది ఏ విధంగా ప్రభావితం చేస్తుందో అన్న డైలమా కూడా కొంత టీఆర్ఎస్-లో ఉంది.

ఇప్పటిదాకా అందరికీ తెలిసిన టీఆర్ఎస్ ఇకపై బీఆర్ఎస్ గా మారనుంది అని విలీనం ఉంటుందని రకరకాల వార్తలు వస్తున్నాయి. వీటితో పాటు క నీస ఓట్లు తెచ్చుకుని జాతీయ పార్టీగా  గుర్తింపు పొందేందుకు ఏపీలో కూడా కేసీఆర్ మనుషులు పోటీ చేస్తారన్న వార్తలున్నాయి. వీటన్నింటిపై ఆయన సానుకూలంగా  సావధానంగా ఆలోచిస్తున్నారు అని కూడా తెలు స్తోంది.

వచ్చే ఎన్నికల్లో ఆయన ఎలా అయినా నాలుగైదు  రాష్ట్రాలలో తన సత్తా చాటనిదే ప రువు నిలబెట్టుకున్నట్లు కాదు. అందుకనే ఆయన కాస్త ఆలస్యం అయినా జాతీయ స్థాయిలో పార్టీని నడిపే  విషయంలో కలిసి వచ్చే శక్తులతో చర్చలకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. విపక్ష పార్టీలలో కూడా ఎవరు నమ్మదగ్గ వ్యక్తులు అన్న  ఆరా కూడా ఆయన తీస్తున్నారని తెలుస్తోంది. మోడీకి వ్యతిరేకంగా పనిచేస్తే ఏమౌతుంది ఏ విధంగా మైలేజీ తెచ్చుకోవచ్చు అన్నవి కూడా ఆయన మరో మారు ఆలోచిస్తున్నారు.