Begin typing your search above and press return to search.

అరుదైన చేపను కనిపెట్టిన సీఎం కుమారుడు !

By:  Tupaki Desk   |   17 Oct 2020 7:30 AM GMT
అరుదైన చేపను కనిపెట్టిన సీఎం కుమారుడు !
X
పశ్చిమ కనుమలు శాస్త్రవేత్తలు స్కిస్తురా జాతికి చెందిన ఓ కొత్తరకం చేపను కనుగొన్నారు. ఈ స్కిస్తురా జాతికి చెందిన చేపలు చాలా అరుదుగా లభిస్తాయి. ఇవి చాలా చిన్న అందంగా, బంగారపు రంగులో పైన కొద్దిగా వెంట్రుకలు కలిగి చాలా చూడముచ్చటగా ఉంటాయి.అయితే , ఈ చేపలు అన్ని రకాల నీళ్లల్లో జీవించలేవు. ఆక్సిజన్‌ శాతం ఎక్కువగా ఉండే మంచి నీటి చెరువులతోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి.

దీనిని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాక్రే కుమారుడు తేజస్‌ థాక్రే, ఐసీఏఆర్‌ ఇన్ ‌స్టిట్యూట్‌ పోర్టుబ్లెయర్కు చెందిన జయసింహన్‌ ప్రవీణ్ ‌రాజ్‌, అండన్‌ వాటర్‌ ఫోటోగ్రాఫర్‌ శంకర్‌ బాలసుబ్రహ్మణ్యన్‌ కలిసి పశ్చిమ కనుమలలో కనుగొన్నారు. దీనికి ‘స్కిస్తురా హిరణ్యాక్షి’ అని నామకరణం చేశారు. ఇది హిరణ్యాక్షి అనే నదిలో లభించడం వల్ల దీనికి ఈ పేరు పెట్టారు. దీనికి సంబంధించిన వివరాలను వారు ఆక్వా ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ ఇక్తాలజీలో ప్రచురించారు.

హిరణ్యాక్షి అంటే బంగారపు రంగు జుట్టు కలది అనే అర్థం కూడా వస్తుండటంతో ఈ పేరు చేపను వర్ణించడానికి కూడా సరిపోతుంది. ఇక ఈ చేపను తేజస్‌థాక్రే 2012లోనే కనుగొన్నారని ప్రవీణ్‌ రాజ్‌ చెప్పారు. దాని తరువాత 2017 లో ఈ జాతికి సంబంధించిన మరిన్ని చేపలను కనుగొన్నట్లు ప్రవీణ్‌ తెలిపారు. దీంతో దీని మీద మరింత రీసెర్చ్‌ చేసి దీనికి సంబంధించిన వివరాలను జర్నల్ ‌లో వెల్లడించారు.