చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న అరెస్టు?

Wed Mar 22 2023 11:23:11 GMT+0530 (India Standard Time)

Teenmar Mallanna Arrest

అసలేం జరిగిందన్న స్పష్టత లేదు. అదే సమయంలో వాట్సాప్ గ్రూపుల్లోనూ.. సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నట్లుగా క్యూ న్యూస్ యూ ట్యూబ్ చానల్ యజమాని చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా చెబుతున్నారు.  అయితే.. దీనికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులు ధ్రువీకరించకపోవటం గమనార్హం.మేడిపల్లు పోలీసులు క్యూ న్యూస్ ప్రతినిధులు ప్రయాణిస్తున్న వాహనాన్ని తనిఖీలు చేపట్టగా.. క్యూన్యూస్ ప్రతినిధులు పోలీసుల విధులకు ఆటంకం కలిగించినట్లుగా చెబుతున్నారు.

మంగళవారం రాత్రి వేళలో మేడిపల్లి పోలీసులు.. ఎస్ వోటీ పోలీసులు కలిసి ఫిర్జాది గూడ - వరంగల్ హైవే మీద వాహనాల్ని తనిఖీ చేస్తున్నారు.వీరంతా సివిల్ డ్రెస్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది.  ఆ ప్రాంతంలోనే క్యూ న్యూస్ ఆఫీసు ఉండటంతో తమ ఆఫీసు ముందు గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహించినట్లుగా అనుమానించారు. కొంతమంది పోలీసు సిబ్బందిని బెదిరించి.. ఒక గదిలో బంధించారు.

ఇక్కడో విషయాన్ని ప్రస్తావించాలి. రెండు రోజుల క్రితమే క్యూ న్యూస్ ఆఫీసులోకి జొరబడిన మంత్రి మల్లారెడ్డి అనుచరులుగా చెబుతున్న వారు.. విద్వంస కాండకు పాల్పడటం.. ఈ సందర్భంగా ఆపీసులో పెద్ద ఎత్తున విధ్వంసం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి అనుమానితులుగా భావించిన క్యూ న్యూస్ సిబ్బంది.. మఫ్టీలో ఉన్న పోలీసుల్ని అదుపులోకి తీసుకున్నారు.

ఈ విషయం గురించి తెలిసిన పోలీసుల టీం.. క్యూ న్యూస్ కార్యాలయానికి వెళ్లి బందీలుగా ఉన్న మఫ్టీలోని పోలీసుల్ని విడిపించినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో పలువురిని అదుపులోకి తీసుకున్నారని.. వారిలో తీన్మార్ మల్లన్న కూడా ఉన్నట్లుగా చెబుతున్నారు.

పోలీసులపై దాడికి పాల్పడ్డారన్న నేరారోపణలతో వారిని  అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో తీన్మార్ మల్లన్న కూడా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే.. దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటివరకుఎలాంటి అధికారిక సమాచారాన్ని వెల్లడించింది లేదు.  


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.