Begin typing your search above and press return to search.

బుర్జ్ ఖలీఫాపై మెరిసిన టీమిండియా కొత్త జెర్సీ !

By:  Tupaki Desk   |   14 Oct 2021 7:14 AM GMT
బుర్జ్ ఖలీఫాపై మెరిసిన టీమిండియా కొత్త జెర్సీ !
X
టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా ధరించే జెర్సీ‌ని కిట్ స్ఫాన్సర్ ఎంపీఎల్ స్పోర్ట్స్ ఈసారి సరికొత్తగా రూపొందించింది. యూఏఈ, ఒమన్ వేదికగా అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకూ టీ20 వరల్డ్‌కప్ జరగనుండగా.. భారత్ జట్టు తన తొలి మ్యాచ్‌ని అక్టోబరు 24న పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ మేరకు ఇప్పటికే 15 మందితో కూడిన జట్టుని ప్రకటించిన భారత సెలెక్టర్లు.. టీమ్‌కి మెంటార్‌గా మహేంద్రసింగ్ ధోనీని నియమించిన విషయం తెలిసిందే.

టీమిండియా అభిమానులే స్ఫూర్తిగా జెర్సీని రూపొందించినట్లు చెప్పుకొచ్చిన ఎంపీఎల్ స్పోర్ట్స్.. మ్యాచ్‌ల సందర్భంగా అభిమానులు చేసిన నినాదాలు, హర్షధ్వానాలు ఈ జెర్సీపై పొందుపరిచామని వెల్లడించింది. భారత క్రికెట్ చరిత్రలో ఇలా అభిమానులే స్ఫూర్తిగా జెర్సీని రూపొందించడం ఇదే తొలిసారి. భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లకి అధికారిక కిట్ స్ఫాన్సర్‌గా ఎంపీఎల్ స్పోర్ట్స్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

బిలియన్ ఛీర్స్ జెర్సీని విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్‌ ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ ధరించి ఫొటోలకి పోజిలిచ్చారు. భారత్ వేదికగా జరగాల్సిన టీ20 వరల్డ్‌ కప్‌ కి.. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో యూఏఈ, ఒమన్ ఆతిథ్యమిస్తున్నాయి. అయితే టీ20 ప్రపంచకప్‌ 2021లో టీమిండియా ఆటగాళ్లు ధరించే జెర్సీ చిత్రాలను యూఏఈ అధికారులు బుధవారం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్‌ బుర్జ్‌ ఖలీఫా పై ప్రదర్శించారు. జెర్సీ విడుదలకు సంబంధించిన వీడియోను కూడా ప్లే చేశారు. దాంతో అభిమానులు అందరూ ఒక్క్కసారిగా ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా బుర్జ్‌ ఖలీఫాపై కోహ్లీ, రోహిత్, జడేజాల ఫొటోలు తళుక్కున మెరిసాయి. దీంతో భారత ఫాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. ఇందుకు సంబందించిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.

గతేడాది కూడా ఐపీఎల్ టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ చిత్రాన్ని బూర్జ్ ఖలీపాపై ప్రదర్శించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్‌ బూర్జ్ ఖలీఫాపై ఓ భారత క్రికెటర్ ఫొటో కనిపించడం అదే తొలిసారి. గతంలో మహాత్మా గాంధీ, షారుక్ ఖాన్‌ల ఫొటోలను బూర్జ్ ఖలీఫాపై ప్రదర్శించారు. ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభంలో కోల్‌కతా నైట్ రైడర్స్ లోగో, ఆటగాళ్ల ఫొటోలను బూర్జ్ ఖలీపాపై ప్రదర్శించారు. ఇప్పుడు టీమిండియా ఆటగాళ్ల జెర్సీ చిత్రాలను ప్రదర్శించారు. క్రికెట్ అభిమానుల 'చీర్స్' ప్రేర‌ణ‌తో భారత జట్టు జెర్సీల‌ను రూపొందించిన‌ట్లు బీసీసీఐ తమ ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించింది.