స్టూడెంట్ తో శృంగారం చేస్తూ దొరికిన టీచర్

Tue Oct 08 2019 12:34:53 GMT+0530 (IST)

Teacher found in romance with student

పాఠాలు చెప్పాల్సిన టీచర్.. మైనర్ అన్న విషయాన్ని చూడకుండా శృంగారంలోకి దించేసిన ఘటన అమెరికాలోని ఓక్లహామాలో చోటు చేసుకుంది. స్థానికంగా సంచలనంగా మారిన ఈ ఉదంతంలో టీచరు ఇప్పుడు చట్టపరమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ఉద్యోగాన్ని పోగొట్టుకున్నారు.స్టూడెంట్ తో శృంగారం చేసిన ఈ టీచర్ ఉదంతంలోకి వెళితే.. ఓక్లహామీలోని హైస్కూల్లో సైన్స్ టీచరుగా పని చేస్తోంది హంటర్ డే. తనకున్న లైంగిక వాంఛల్ని మైనర్ బాలుడితో తీర్చుకుంటోంది. కొద్ది రోజులుగా వారి మధ్య వ్యవహారంగా గుట్టుగా సాగిపోతోంది. ఇదిలా ఉంటే.. తమ కొడుకు మొబైల్ పోన్ ను అనుకోని రీతిలో చెక్ చేశారు అతడి పేరెంట్స్.

ఆ సందర్భంగా ఫోన్ లో చేసిన సెక్స్ ఛాటింగ్.. నగ్న చిత్రాలతో పాటు.. దరిద్రపుగొట్టు వ్యవహారాలన్ని బయటకు వచ్చాయి. దీంతో.. షాక్ తిన్నారా తల్లిదండ్రులు. చిన్నపిల్లోడైన తమ పిల్లాడిని ముగ్గులోకి దించి.. తన అవసరాల్ని తీర్చుకుంటున్న టీచర్ మీద పోలీసులకు కంప్లైంట్ చేశారు. లైంగికంగా తమ కుమారుడ్ని వాడుకుంటుందని పేర్కొన్నారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. కంప్లైంట్ లో ఉన్నది నిజమేనని నిర్దారించారు. ఒకరోజు విద్యార్థితో టీచర్ హంటర్ డే శృంగారం చేస్తున్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టేసుకున్నారు. అనంతరం అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న స్కూల్ యాజమాన్యం.. టీచర్ ను విధుల నుంచి తప్పించింది. ప్రస్తుతం ఆమె కేసును ఎదుర్కొంటున్నారు.