టీడీపీ లో ఆగని జంపింగ్..జపాంగ్ లు...

Wed Nov 20 2019 10:09:58 GMT+0530 (IST)

Tdp Leaders Jumping To Other Partys

ఏపీలో ప్రతిపక్ష టీడీపీ కి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. పార్టీని వీడుతున్న నేతల సంఖ్య పెరుగుతుండటంతో అధినేత చంద్రబాబు ను శ్రేణులను తీవ్రంగా కలవర పెడుతోంది. సీనియర్లు అంకితభావం అనే ముద్ర పొందిన వారూ కూడా పార్టీ కి దూరమవుతుండటం పార్టీ దీనస్థితి సూచిస్తోందని  రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు ఇసుక దీక్ష చేపట్టిన రోజే  టీడీపీ లో కదుపులు మొదలయ్యాయి. గన్నవరం ఎమ్మెల్యే వంశీ మోహన్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించగా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడి గా గుడివాడ నియోజకవర్గ ఇన్‌చార్జ్ గా ఉన్న దేవినేని అవినాష్  ఏకంగా వైసీపీ కండువా కప్పుకున్నారు.చంద్రబాబు కు ఈ రెండూ మూమూలు షాక్‌లు కావు. పైగా వీరిద్దరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే.
అయితే  కృష్ణా జిల్లాలోనే కాక ఒకప్పటి టీడీపీ కంచుకోటలుగా నిలిచిన  తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా నాయకులు పార్టీని వీడుతున్నారు. కొంతకాలంగా పార్టీలోనే ఉండి తీవ్ర అసమ్మతి గళాన్ని  వినిపిస్తున్నతూర్పుగోదావరి జిల్లా టీ గన్నవరం ఇన్‌చార్జ్  నేల పూడి స్టాలిన్ బాబును పార్టీ నుంచి చంద్రబాబు  సస్పెండ్ చేశారు. పార్టీలో ఉండలేకే ఆయన అసమ్మతి గళం వినిపించడం తో ఆయన్ను సస్పెండ్ చేయక తప్పని పరిస్థితి ని కల్పించారని టీడీపీ వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇక అంతకు ముందే అదే జిల్లా కు చెందిన ప్రత్తిపాడు ఇన్‌చార్జ్ వరుపుల రాజా సైతం పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఆయన కూడా వైసీపీ లోకి జంప్ చేసే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అంతకు ముందే  రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పార్టీ కి రాంరాం చెప్పేశారు. దీంతో ఈ నియోజకవర్గం టీడీపీ కూడా ఖాళీ అయనట్లయింది. ఈ ఒక్క జిల్లాలోనే ఏకంగా ముగ్గురు నియోజక వర్గాల ఇన్‌చార్జ్ లు పార్టీని వీడటం పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన చలమల శెట్టి సునీల్‌ది అదే పరిస్థితి.  

మరో రెండు మూడు నెలల్లో మరో ఐదు నియోజవకర్గాల్లో పార్టీ  నాయకులు పెద్ద ఎత్తున వైసీపీలో చేరిపోతారని తెలుస్తోంది. చేరిపోయే వారి జాబితా లో పాడేరు మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్‌చార్జ్ గా ఉన్న గిడ్డి ఈశ్వరి రంపచోడవరం ఇన్‌చార్జ్ మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అరకులోయ పార్టీ ఇన్‌చార్జ్ మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ విశాఖ జిల్లా యలమంచిలి ఇన్‌చార్జ్ పంచకర్ల రమేష్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.