Begin typing your search above and press return to search.

జనసేన ఎవరి నెత్తిన పాలు పోసింది...?

By:  Tupaki Desk   |   18 March 2023 7:00 AM GMT
జనసేన ఎవరి నెత్తిన పాలు పోసింది...?
X
ఏపీలో జనసేన ఫ్యాక్టర్ ఒకటి ఉంది. అది ఎవరూ కాదనలేని విస్మరించలేని నిజం. జనసేన ఒక ఫోర్స్ గా ఎమర్జ్ అయ్యే క్రమం ఇంకా రాలేదు, కానీ వచ్చే ఎన్నికలు ఆ పార్టీ ప్రభావం ఏంటో చాటి చెప్పనున్నాయి. ఇంకో వైపు చూస్తే జనసేన ఉత్తరాంధ్రా పట్టభద్రుల ఎన్నికల్లో పోషించిన పాత్ర ఏంటి అన్నది ఇపుడు చర్చకు వస్తోంది.

జనసేన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన అభ్యర్ధులను దించలేదు. ఆలగని మిత్రపక్షం బీజేపీకి సపొర్ట్ చేస్తూ ప్రకటన చేయలేదు. వైసీపీని ఓడించండి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి ఊరుకుంది. దాంతో జనసేన ఓటింగ్ ఏ పార్టీ వైపు టర్న్ అయింది అన్నదే ఇపుడు హాట్ టాపిక్ గా ఉంది.

ఉత్తరాంధ్రా మూడు జిల్లాలలో కాపులు పెద్ద ఎత్తున ఉన్నారు. టీడీపీ తరఫూన్ నిలబడిన వేపాడ చిరంజీవరావు కాపు సామాజిక వర్గానికి చెందిన వారే. ఆ మాటకు వస్తే జనసేన ఓట్ల కోసం తెలివైన వ్యూహంగా టీడీపీ చివరి నుముషంలో తన అభ్యర్ధ్ని మార్చిందని చెప్పుకున్నారు.

అలా చిరంజీవరావుకు జనసేన నుంచి మద్దతు దక్కిందా అన్నదే డిస్కషన్ గా ఉంది. జనసేన మాకు మద్దతు ప్రకటించి ఉండాల్సింది అని బీజేపీ నేతలు అంతర్మధనం చెందారు. అయితే న్యూట్రల్ స్టాండ్ ని ఆ పార్టీ తీసుకుని పార్టీ వారికి స్వేచ్చ ఇచ్చేసింది. వారు వైసీపీకి తప్ప ఎవరికైనా ఓటేసుకోవచ్చు అని చెప్పేసింది.

బీజేపీతో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్న జనసేన ఇస్తే మద్దతు టీడీపీకే ఇస్తుందని కూడా అనుకున్నారు. దాంతో కొత్త అభ్యర్ధిగా రంగంలోకి వచ్చిన వేపాడ చిరంజీవిరావు అద్భుతమైన మెజారిటీలు సాధించారు అంటే దాని వెనక జనసేన సైలెంట్ ఓటింగ్ కూడా ఉందని అంటున్నారు. జనసేన గట్టిగానే పనిచేసిందని అంటున్నారు.

దాని ఫలితమే ఇలా టీడీపీకి మంచి విజయం అని అంటున్నారు. మూడు జిల్లాలలో ఉన్న జనసేన క్యాడర్ అంతా బలమైన విపక్ష పార్టీగా తెలుగుదేశాన్ని ఎంచుకుని ఓట్లేశారు అని అంటున్నారు. సామాజిక సమీకరణల లెక్క సరిపోవడంతో జనసేన ఓటింగ్ కూడా వచ్చి పడిందని అంటున్నారు.

ఈ విధంగా చూసుకుంటే రెండు పార్టీలు కలిస్తే ఏపీలో రాజకీయ రిజల్ట్ ఎలా ఉంటుందో, అది ఎంతటి రీ సౌండింగ్ చేస్తుందో జస్ట్ ఒక ఉదాహరణగా ఎమ్మెల్సీ ఫలితాలు నిలిచాయని చెబుతున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు సైతం ఎన్నికల ముందు ఒక పిలుపు ఇచ్చారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చకుండా ఉండాలని అందరూ తమకు మద్దతు ఇవ్వాలని, సరిగ్గా ఇదే పిలుపు పవన్ కళ్యాణ్ ఇప్పటికి చాలా సార్లు ఇచ్చారు.

ఇపుడు అది వర్కౌట్ అయింది అని అంటున్నారు. అదే విధంగా చూసుకుంటే విశాఖ అర్బన్, రూరల్, శ్రీకాకుళం, విజయనగరం అన్న తేడా లేకుండా అన్ని చోట్లా కూడా టీడీపీకి మంచి మద్దతు లభించింది అని అంటున్నారు. జనసేన తమ పార్టీ అభ్యర్ధిని పోటీకి నిలపకపోవడం కూడా కలసివచ్చే పరిణామంగా చెప్పుకుంటున్నారు. ఇలా చేయడం ద్వారా జనసేన టీడీపీ నెత్తిన పాలు పోసిందని అదే టైం లో వైసీపీకి గట్టి షాక్ ఇచ్చేసింది అని అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే బీజేపీకి మరీ దారుణంగా ఓట్లు పోల్ కావడంతో జనసేన మద్దతు అయితే ఆ పార్టీకి ఏ మాత్రం లేదన్న అంచనాలకు కూడా వస్తున్నారు. సో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ సరళిని చూస్తే ఏపీలో అధికార వైసీపీని కట్టడి చేసేందుకు వాడిన అద్భుత వ్యూహంగానే దీన్ని చూస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.