ఈ కామర్స్ రంగంలోకి టాటా గ్రూప్.. ఇక అమేజాన్ ఫ్టిప్ కార్టులకు చుక్కలేనా!

Wed Sep 30 2020 05:00:01 GMT+0530 (IST)

Tata Group enters the e commerce sector

మన దేశ ప్రముఖ కార్పొరేట్ సంస్థ టాటా గ్రూప్ ఇక ఈ కామర్స్ రంగంలోకి అడుగు పెట్టబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే దేశంలో పాతుకు పోయిన అమేజాన్ ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలకు టాటా గ్రూప్ గట్టి పోటీ ఇవ్వనున్నది. ఈ మేరకు ఆ కంపెనీ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు.
ఇప్పటికే చాలా రంగాల్లో తనదైన ముద్రవేసిన టాటా ఈ కామర్స్ రంగంలో కూడా రాణించాలని ఉన్విళ్లూరుతోంది.  113 బిలియన్ డాలర్ల టాటా హోల్డింగ్స్ సంస్థ కాఫీ వ్యాపారం నుంచి కార్ల ఉత్పత్తి వరకూ చేస్తోంది. హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ ప్రైవేట్ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీలతో సహా ఫైనాన్స్ స్ట్రాటజిక్ పెట్టుబడి దారులను తీసుకు రావడానికి అన్వేషించడానికి సలహా దారులతో కలిసి పనిచేస్తోంది. ఈ కామర్స్ రంగంలో కొత్త ప్లాట్ ఫాంను సృష్టించడానికి వివిధ టాటా వ్యాపారాలను ఒకే  డిజిటల్ వేదికపై తెచ్చేందుకు టాటా ప్రయత్నిస్తోందని సంస్థ ప్రతినిధులు ఒకరు తెలిపినట్లు ఎకనామిక్ టైమ్స్ పత్రిక ఒక కథనంలో పేర్కొంది.అయితే ఇప్పటికే మన దేశంలో అమెజాన్. కామ్ వాల్‌మార్ట్ ఇంక్ భారతీయ వెంచర్ ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే ఈ కామర్స్లో దేశంలో దూసుకుపోతున్నాయి. వీటితో పోటీ పడేందుకు టాటా కంపెనీ ఎటువంటి ప్రయత్నాలు చేస్తుందో వేచి చూడాలి.  కరోనా మహమ్మారితో టాటా కంపెనీ కొంత ఒడిదొడుకుల్లో ఉన్నది. ఈ నేపథ్యం లో ఈ కామర్స్ రంగంలోకి వస్తే లాభాల బాట పట్టవచ్చని కంపెనీ భావిస్తున్నట్టు సమాచారం. టాటా గ్రూప్ ఇప్పటికే రిటైల్ రంగంతో పాటు ఆన్ లైన్ సర్వీసులను ప్రారంభించింది. వీటిలో తనిష్క్ ఆభరణాల దుకాణాలు టైటాన్ వాచ్ షోరూమ్ లు స్టార్ బజార్ సూపర్ మార్కెట్లు తాజ్ హోటళ్ల గొలుసు మరియు భారత దేశంలో స్టార్ బక్స్ తో జాయింట్ వెంచర్ ఉన్నాయి.

యాప్ తయారు చేసేదేవరు?
టాటా డిజిటల్ అధిపతి ప్రతీక్ పాల్ ఈ ఆల్ ఇన్ వన్ యాప్‌ను నిర్మించే బాధ్యతను తీసుకున్నట్టు సమాచారం. టీసీఎస్ లో మూడు దశాబ్దాల పాటు ప్రతీక్ పాల్ రిటైల్ విభాగాధిపతి గా పని చేశారు. ప్రపంచం లోని పలు ఈ కామర్స్ సంస్థల కు ఆయన తోడ్పాటు ను అందించారు.