కుప్పంలో ఈరోజు ఉదయం ప్రారంభమైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. లోకేష్ కు మద్దతుగా ఈ యాత్రలో పాల్గొన్న సినీనటుడు నందమూరి తారకరత్న సొమ్మసిల్లి పడిపోయాడు.టీడీపీ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున రావడంతోనే తారకరత్న సొమ్మసిల్లి పడిపోయి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే తారకరత్నను ఆస్పత్రికి తరలించారు.
తారకరత్నకు కార్డియాక్ అరెస్ట్ అనే అనుమానంతో వైద్యులు మొదట సీపీఆర్ చేశారు. హార్ట్ బీట్ వచ్చిందని తేలింది. కార్డియాలజిస్ట్ గుండెపోటు అని తేల్చడంతో కుప్పం మెడికల్ కాలేజీకి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందసి్తున్నారు. టీడీపీ నేత హీరో బాలయ్య ఆస్పత్రికి చేరుకొని అన్నీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
నందమూరి తారకరత్న కోలుకుంటున్నారని బాలకృష్ణ తెలిపారు. డాక్టర్లు ఆయనకు వైద్యం అందిస్తున్నారని హార్ట్ బీట్ నార్మల్ గా ఉందని తెలిపారు. మరింత మెరుగైన చికిత్స కోసం తారకరత్నను బెంగళూరు తరలిస్తామని వెల్లడించారు.
బెంగళూరుకు రోడ్డు మార్గంలో అంబులెన్స్ లో తరలిస్తామని చెప్పారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బాలకృష్ణ సూచించారు. డాక్లర్ల సూచనతోనే బెంగళూర్కు తరలిస్తున్నామని.. గుండెలో ఎడమవైపు 90 శాతం బ్లాక్ అయ్యిందని బాలకృష్ణ మీడియాకు వివరించారు.
ఎయిర్ లిఫ్ట్ చేయాలని అనుకున్నామని.. కానీ అన్ని పరికరాలు అందుబాటులో ఉండవని.. అంతేకాదు అనుమతులు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందని బాలయ్య తెలిపారు. అంబులెన్స్ లో తరలిస్తే మెడికల్ ట్రీట్ మెంట్ అందుబాటులో ఉంటుందని బాలకృష్ణ తెలిపారు. తాము అంబులెన్స్ లోనూ తారకరత్నను బెంగళూరుకు తరలించాలని భావిస్తున్నామని తెలిపారు.
ఇక తారకరత్న ఆరోగ్యంపై చంద్రబాబు ఆరాతీస్తున్నారు. 10 నిమిషాలకు ఒకసారి తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి ఫోన్ చేసి వాకబు చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.