IPL 2023 ప్రారంభ వేడుకలు అత్యంత వైభవంగా సాగాయి. తమన్నా భాటియా- రష్మిక మందన క్రేజీ చార్ట్ బస్టర్ సాంగ్స్ కి డ్యాన్స్ చేయడం ద్వారా IPL ప్రారంభ వేడుకలకు అదనపు గ్లామర్ ని అద్దారు. సమంతా రూత్ ప్రభు ఐకానిక్ చార్ట్ బస్టర్ సాంగ్ `ఊ అంటావా...`పాటకు నృత్యం చేసింది. పుష్ప పాటకు ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేశారు.
ఊ అంటావాతో పాటు.. తమన్నా స్టెప్పులు గ్యాలరీలో క్రికెట్ ప్రియులను ఉర్రూతలూగించగా.. పలు పాటలకు తమన్నా నర్తనలు కిక్కు పెంచాయి. దిల్జిత్ దోసాంజ్ లవర్ వెర్షన్ ..గుజరాతీ చోగడ నృత్యాలతోను మిల్కీ బ్యూటీ ఆకట్టుకుంది.
`గుండే` చిత్రం నుండి ట్యూన్ మారి ఎంట్రీయన్ డ్యాన్స్ ఎంతో ప్రత్యేకంగా మెరుపులు మెరిపించింది. ఈ వేదికపై తమన్నా లుక్ వీక్షకులు కంటికి స్పెషల్ ట్రీట్.. అబ్బురపరిచే గోల్డెన్ బాడీసూట్ లో తమన్నా అందాలు వీక్షించేందుకు రెండు కళ్లు చాలలేదంటూ అభిమానులు ప్రశంసించారు.
IPL 2023 ప్రారంభ వేడుక అహ్మదాబాద్- నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగినందున ప్రదర్శన ఆద్యంతం సాయం సంధ్య వేళ రక్తి కట్టించింది. టోర్నమెంట్ కొత్త సీజన్ ను ప్రారంభించడానికి సహాయపడటానికి తమన్నా తర్వాత రష్మిక మందన్న.. అరిజిత్ సింగ్ చేరారు.
ఈ ముగ్గురూ తమ ప్రదర్శనలతో స్టేడియంను హోరెత్తించారు. ముఖ్యంగా రష్మిక మందన సామీ సామీ పాటకు నర్తిస్తుంటే స్టేడియంలో ప్రేక్షకులు విజిల్స్ హోరెత్తించారు. నేషనల్ క్రష్ పై తమ క్రష్ ఏ రేంజులో ఉందో ఆవిష్కరించారు.
ఐపీఎల్ 2023 నాలుగు సంవత్సరాల పాటు కోవిడ్-19 మహమ్మారి కారణంగా పాక్షికంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. పాక్షికంగా స్వదేశంలో లేదా పాక్షికంగా దేశం వెలుపల ఫార్మాట్ లో ఆటను చూడాల్సొచ్చింది.
శుక్రవారం సాయంత్రం గుజరాత్ టైటాన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ ( GT vs CSK )మధ్య అహ్మదాబాద్ లోని కిక్కిరిసిన నరేంద్ర మోడీ స్టేడియంలో మొదటి మ్యాచ్ జరుగింది. గుజరాత్ టైటాన్స్ కు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తుండగా.. ఎంఎస్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ కు కెప్టెన్ కూల్ గా తిరిగి వచ్చాడు. ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ విజేతగా నిలిచింది.