ఇది కేసీఆర్ ఉగ్రరూపం..ఎన్ కౌంటర్ పై తలసాని స్పందన!

Fri Dec 06 2019 18:24:07 GMT+0530 (IST)

Talasani Srinivas Yadav Response on Disha Case Accused Encounter

గత పది రోజులుగా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు నిందుతులని శుక్రవారం తెల్లవారుజామున కేసు రీ కన్ స్ర్టక్చన్ కోసం  బాధితురాలిని హత్య చేసిన చటాన్‌పల్లి బ్రిడ్జి వద్దకు తీసుకొచ్చారు. ఆ సమయంలో నిందితులు బాధితురాలికి చెందిన వస్తువులను అక్కడ పెట్టామని ఇక్కడ పెట్టామంటూ తిప్పారని చెప్పారు. ఆ తర్వాత అక్కడ నిందితులు పాతిపెట్టిన బాధితురాలికి సంబంధించిన సెల్ ఫోన్ - పవర్ బ్యాంక్ - వాచీని పోలీసులు  గుర్తించారు. అయితే ఆ సమయంలోనే నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించి రాళ్లు - కర్రలతో దాడి చేసి - పోలీసుల నుండి తుపాకీని ప్రధాన నిందితుడు ఆరిఫ్  లాగేసుకొని ..ఫైర్ స్టార్ట్ చేయడం తో పోలీసులు ఫైర్ చేయడంతో ఆ నలుగురు నింధితులు అక్కడికక్కడే మృతి చెందారు.ఇక పోలీసులు చేసిన ఈ ఎన్ కౌంటర్ పై  పెద్దయెత్తున హర్షం వ్యక్తం అవుతున్న నేపధ్యంలో నగరానికి చెందిన రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు.   ఇది కేసీఆర్ ఉగ్రరూపం అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఎన్ కౌంటర్ దేశానికే మార్గదర్శకమని తలసాని అన్నారు. నిర్భయ నిందితులు ఇంకా జైలులోనే ఉన్నారని తెలిపారు. కేసీఆర్ మౌనాన్ని చాలామంది తక్కువగా అంచనా వేశారని ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దిశ కుటుంబాన్ని పరామర్శించలేదని అన్న వారే నేడు ఆయనకు జేజేలు కొడుతున్నారని - సంక్షేమ పథకాలే కాదు మహిళల రక్షణలో తెలంగాణ ప్రభుత్వం ప్రధమస్థానంలో నిలిచిందని మంత్రి తలసాని అన్నారు. ప్రస్తుతం దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందని... కేసీఆర్ ని జాతీయ నేతలు సైతం ప్రశంసిస్తున్నారని తలసాని  చెప్పారు.