Begin typing your search above and press return to search.

దారుణం : బ్రతికుండగానే శ్మశానానికి తీసుకెళ్లారు!

By:  Tupaki Desk   |   3 Aug 2020 3:00 PM GMT
దారుణం : బ్రతికుండగానే  శ్మశానానికి తీసుకెళ్లారు!
X
కరోనా మహమ్మారి...మనుషుల్లో ఎదో ఒక మూల నిన్నమొన్నటి వరకు దాగిఉన్న మంచితనాన్ని కూడా తొలగించేస్తుంది. కరోనా భయంతో ప్రతి ఒక్కరు కూడా ఎదుటివారికి సాయం చేయాలి అంటేనే భయపడుతున్నారు. కనీసం చావు బ్రతుకుల్లో ఉన్నా కూడా వారిని చూసి చూడనట్టు పక్కనుండి పోయే రోజుల్లో మనం జీవిస్తున్నాం. తాజాగా ప్రకాశం జిల్లా కందుకూరు లో ఓ దారుణమైన చోటుచేసుకుంది. బ్రతికున్న వ్యక్తిని హాస్పిటల్ నుండి సరాసరి శ్మశానానికి తీసుకెళ్లారు. ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషయమించడంతో , హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకువస్తే ..తాము అద్దెకి ఉండే ఇంటి యజమాని కరోనా భయంతో ఇంట్లోకి రానివ్వలేదు. దీనితో వారు చేసేదేమి లేక ఒకేసారి స్మశానంలో ఉన్న క్షేత్రానికి తీసుకెళ్లారు.

ఈ దారుణ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే .. కందుకూరు పట్టణంలోని గణేశ్‌ నగర్‌లో నివాసం ఉండే వెంకటేశ్వర్లు రేడియో మెకానిక్‌ గా చేస్తూ సంసారాన్ని సాగిస్తున్నాడు. అయితే, గురువారం అర్ధరాత్రి బాత్‌ రూంకు వెళ్లాడు. అక్కడే బ్రెయిన్‌ హెమరేజ్‌తో పడిపోయాడు. వేకువజామున కొంచెం తేరుకొని ఇంటి తలుపు తట్టాడు. కుటుంబ సభ్యులు చూసి హడావుడిగా ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. కరోనా భయంతో అక్కడ ఎవరు చేర్చుకోలేదు. ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కి తీసుకుపోతే కండిషన్ క్రిటికల్ అని ఒంగోలు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. ఒంగోలులో కూడా మూడు ప్రైవేటు ఆస్పత్రులు కరోనా భయంతో చేర్చుకోలేదు. చివరికి ఓ కార్పొరేట్‌ హాస్పిటల్ కరోనా టెస్ట్ చేసి, నెగెటివ్‌ రావడంతో అడ్మిట్ చేసుకున్నారు. అయితే ఆ తర్వాత స్కానింగ్‌లో ఆయనకు ఊపిరితిత్తుల్లో సమస్య ఉందని చెప్పి ట్రీట్మెంట్ చేయలేదు. దానితో ఈ విషయం విలేకరుల ద్వారా తెలుసుకున్న కందుకూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎం.మహీధర్‌ రెడ్డి వైద్యశాల యాజమాన్యంతో మాట్లాడి వెంకటేశ్వర్లుకు వైద్యం కొనసాగించేలా చర్యలు తీసుకున్నారు.

అక్కడ రెండు రోజులు చికిత్స జరిగిన తర్వాత ఆరోగ్యం కుదుటపడక పోవడంతో కుమారులు ఆయన్ను తిరిగి ఆదివారం మధ్యాహ్నం కందుకూరుకి తీసుకొచ్చారు. వెంకటేశ్వర్లు ఉంటున్న ఇంటి యజమాని ఇంట్లోకి రానివ్వలేదు. అలాగే, కొడుకులు ఉండే ఇళ్ల వద్ద సరైన వసతులు లేకపోవడం తో బ్రతికుండగానే స్మశానానికి తీసుకెళ్లారు. దీనిని చూసిన బంధువులు, స్థానికులు, కుటుంబ సభ్యులను వారించి ఆస్పత్రిలో చేర్పించాలని ఒత్తిడి తెచ్చారు. మరోసారి ఎమ్మెల్యే దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. ఆయన చొరవతో స్థానిక ప్రైవేటు వైద్యశాలలో చికిత్స చేస్తున్నారు. ప్రస్తుతం అయన నిలకడగా ఉన్నట్టు తెలుస్తుంది.