Begin typing your search above and press return to search.

విమానంలో నగ్నంగా... ఏమిటీ వింతప్రయాణాలు!

By:  Tupaki Desk   |   5 Jun 2023 4:17 PM GMT
విమానంలో నగ్నంగా... ఏమిటీ వింతప్రయాణాలు!
X
అతితక్కువ సమయంలో సుదూర ప్రాంతాలను చేరుకోవడానికి విమాన ప్రయాణాలపైనే మెజారిటీ ప్రజలు ఆదారపడుతుంటారు. పైగా విమాన ప్రయాణాలు ప్రజలకు మరింత అందుబాటులోకి వచ్చిన రోజులివి. దీంతో ఖర్చు కాస్త ఎక్కువ అని అనిపించినా.. అంతకుంచి సమయం విలువైనది కదా అనేది దానికి అనుబంధంగా వినిపించే సమాదానం. అయితే ప్రపంచంలో వింతైన విమాన ప్రయాణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వియత్నా దేశంలోని "వియట్ జెట్ ఏవియేషన్" సంస్థ సీఈఓ గ్యుయెన్ థి ఫుఓంగ్ థావ్ కు ఒక సరికొత్త ఆలోచన వచ్చింది. అదేమిటంటే... బికినీ ధరించిన మహిళలను విమాన ఎయిర్‌ హోస్టెస్‌ లుగా తీసుకురావాలని. దీన్ని ఒక కొత్త వ్యూహంగా ఆయన అభివర్ణించుకున్నారు కూడా. అందులో భాగంగా... హవాయి‌ డ్యాన్స్ చేస్తూ, బికినీలో మాత్రమే పనిచేసే మహిళలు తన స్వదేశీ విమానయాన సంస్థలో పనిచేస్తే బాగుంటుందని భావించారు.

ఇదే క్రమంలో ప్రసిద్ధ అమెరికన్ రెస్టారెంట్ చైన్ హూటర్స్ చమత్కారమైన ఆలోచనతో ముందుకు వచ్చింది. ఎయిర్‌ లైన్స్ కంపెనీలతో ఈ సంస్థ గతంలో ఒక డీల్ కుదుర్చుకుంది. అందులో భాగంగా... ఇద్దరు హూటర్స్ గర్ల్స్, ఫ్లైట్ అటెండెంట్లు... చిన్నచిన్న దుస్తులు, స్కర్టులు ధరించి ప్రయాణికులను పలకరిస్తూ, వయ్యారాలు ఒలకబోస్తూ వారికి రకరకాల ఆతిథ్య సేవలు అందించేవారు. అయితే తాజాగా ఈ సంస్థ ఎయిర్ సేవల్ని నిలిపేసింది!

ఇక 2015లో మలేషియాలో ప్రారంభించబడిన రయానీ ఎయిర్‌ లైన్స్‌ సంస్థ తీరు మరీ దారుణంగా ఉందనే కామెంట్లు వినిపించేవి. ఈ విమానాల్లో పనిచేసే మహిళా ఫ్లైట్ అటెండెంట్లు అందరూ హిజాబ్ ధరించాలని కఠినమైన ట్రావెల్ కోడ్‌ ను తెరపైకి తెచ్చింది. అంతేకాకుండా... ప్రార్థనలు చేసిన తర్వాతే ప్రయాణికులను విమానంలోకి అనుమతించాలనే రూల్ ను తీస్కొచ్చింది. ఇక విమానంలో మద్యపానాన్ని కూడా నిషేధించారు. విమానాల ప్రయాణం మొత్తం ఇస్లామిక్ చట్టాల ప్రకారమే జరిగేది. దీంతో ప్రారంభించబడిన తర్వాత ఏడాదిలోనే ఈ ఎయిర్ లైన్స్ ని మూసివేశారు.

ఇక ఇప్పుడు చెప్పుకునే ఎయిర్ లైన్స్ పూర్తి డిఫరెంట్ గా నడుస్తుంది. జర్మన్ నగరమైన ఎర్ఫర్ట్ నుంచి ప్రముఖ బాల్టిక్ సీ రిసార్ట్‌ కు ఎటువంటి బట్టలూ లేకుండా ప్రయాణికులను తీసుకెళ్లాలనే వింత ఆలోచనతో ఒక జర్మన్ ఎయిర్‌ లైన్ కంపెనీ ముందుకు వచ్చింది. అవును 2008లో ప్రారంభమైన ఈ ఎయిర్ లైన్స్ సంస్థ తీసుకొచ్చిన రూల్స్ ప్రకారం... ప్రయాణికులు విమానం ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు మాత్రమే దుస్తులు ధరించాలి. విమానంలో ఉన్నంత సమయం పూర్తిగా నగ్నంగా ఉండాలి!!