Begin typing your search above and press return to search.

`కంటి వెలుగు` క‌థ వెనుక‌.. కేసీఆర్‌కు చిక్కులు!

By:  Tupaki Desk   |   23 Jan 2023 2:30 AM GMT
`కంటి వెలుగు` క‌థ వెనుక‌.. కేసీఆర్‌కు చిక్కులు!
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న ప‌థ‌కం.. కంటివెలుగు. గ్రామీణ, ప‌ట్ట ణ, న‌గ‌ర ప్రాంతాల్లో ఈ కార్య‌క్ర‌మాన్ని విస్తృతంగా నిర్వ‌హించేలా.. ఏర్పాటు చేశారు. ముఖ్యంగా వృద్ధులు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాల‌ను ఈ కార్య‌క్ర‌మానికి భాగ‌స్వాములు చేయ‌డం ద్వారా.. కేసీఆర్ వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ వేశార‌నేది స్ప‌ష్టంగా తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లోవీరిని ఓటుబ్యాంకుగా మ‌లుచుకోవాల‌నేది క‌నిపిస్తోంది.

ఇదే ఇప్పుడు కేసీఆర్‌కు చిక్కులు తెస్తోంది. కంటి వెలుగు వంటి సెంటిమెంటు ప‌థ‌కంతో ఆయ‌న ప్ర‌జ‌ల ఓటు బ్యాంకును ఇత‌ర విష‌యాల నుంచి మ‌ళ్లించి.. త‌న‌వైపు తిప్పుకోవాల‌ని చూస్తున్నారు. అయితే, అదే స‌మ‌యంలో ఈ కార్య‌క్ర‌మంపై విప‌క్షాలు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. ఈ కంటివెలుగు.. కేసీఆర్ అధికారా నికి వెలుగు తెచ్చుకునేందుకు నిర్వ‌హిస్తున్నార‌ని అంటున్నారు.

దీనికి కార‌ణం.. రాష్ట్ర వ్యాప్తంగా చిన్నారుల్లోనూ కంటి జ‌బ్బులు ఉన్న‌వారు ఎక్కువ‌గానే ఉన్నారు. వీరికి మాత్రం కంటివెలుగును వ‌ర్తింప‌చేయ‌డం లేదు. ఇది రాజ‌కీయంగా కేసీఆర్‌కు చిక్కులు తెస్తోంది. కంటి వెలుగు అంటే.. అంద‌రికీ స‌మానంగా వ‌ర్తింప‌చేయాల‌ని.. అలా కాకుండా కేవ‌లం పెద్ద‌ల‌కు అంటే.. ఓటు హ‌క్కు ఉన్న వారికి మాత్ర‌మే వ‌ర్తింపజేయ‌డం స‌మంజ‌స‌మేనా? అనేది ప్ర‌శ్న‌.

ఇదే విష‌యాన్ని ప్ర‌తిప‌క్షాలు తెర‌మీదికి తెచ్చాయి. కేసీఆర్ కంటి వెలుగు ప‌థ‌కం వెనుక నిర్దిష్ట‌మైన ప్ర‌జా ప్ర‌యోజ‌నం లేద‌ని..కేవ‌లం త‌న ఓటు బ్యాంకును కాపాడుకోవాల‌నే ఉద్దేశం దాగి ఉంద‌ని అంటున్నారు. అందుకే.. చిన్నారుల‌కు ఈ ప‌థ‌కాన్ని వ‌ర్తింప‌జేయ‌కుండా పెద్ద‌ల‌కు మాత్ర‌మే ప‌రిమితం చేశార‌ని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. మ‌రి దీనిపై కేసీఆర్ స‌ర్కారు ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.