Begin typing your search above and press return to search.

ఆ రోజు చుట్టే తెలంగాణ రాజకీయం

By:  Tupaki Desk   |   7 Sep 2019 11:12 AM GMT
ఆ రోజు చుట్టే తెలంగాణ రాజకీయం
X
కరుడుగట్టిన జాతీయ భావజాలంతో బీజేపీ ఒకవైపు.. లౌకిక వాదంమంటూ గంగాజమున తహజీమ్ సిద్ధాంతంతో టీఆర్ఎస్ మరోవైపు.. రెండు వైరిపక్షాలు ఢీ అంటే ఢీ అనే సందర్భం రాబోతోంది. దేశమంతా ఇదే జాతీయ భావంతో కొట్టి అధికారాన్ని కొల్లగొట్టిన బీజేపీ.. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే అస్త్రాన్ని ప్రయోగించేందుకు రెడీ అయ్యింది.

సెప్టెంబర్ 17.. హైదరాబాద్ సంస్థానం భారత్ లో విలీనం అయిన రోజు. తెలంగాణకు స్వతంత్ర్యం వచ్చిన ఈరోజును క్యాష్ చేసుకోవాలని బీజేపీ పెద్దపెద్ద ప్లాన్లు వేసింది. ఆరోజును కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చేయించాలని పట్టుదలగా ఉంది.

అయితే ఇప్పటికే టీఆర్ ఎస్ లో లుకలుకలు మొదలయ్యాయి. వీటిని క్యాష్ చేసుకోవాలిన బీజేపీ ప్లాన్ చేస్తోందట.. కేసీఆర్ - కేటీఆర్ వైఖరులపై మెల్లమెల్లా నిరసన గళాలు వినిపిస్తున్నాయి. మంత్రి ఈటల - ఎమ్మెల్యే రసమయి ఇప్పటికే బయటపడి కేసీఆర్ అధికార అహంపై దెబ్బకొట్టేలా మాట్లాడారు. ఇప్పుడు బిగవుపట్టుకొని ఉన్న టీఆర్ ఎస్ నేతలు చాలా మంది ఈరోజు ఓపెన్ అవుతారని బీజేపీ భావిస్తోంది. అలాంటి వాతావరణం క్రియేట్ చేసేందుకు రెడీ అవుతోందట...

సెప్టెంబర్ 17న టీఆర్ ఎస్ ను జాతీయ వాదంతో కొట్టాలని చూస్తున్న బీజేపీ ఇప్పుడు టీఆర్ ఎస్ లోని అసంతృప్త గళాలను ఆకర్షించేందుకు రెడీ అయ్యిందంట.. అమిత్ షా వచ్చి కనుక పిలుపునిస్తే.. నేతలను స్వాగతిస్తే టీఆర్ ఎస్ నుంచి కూడా వలసలు ఉండే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో గులాబీ దండుకు సెప్టెంబర్ 17 టెన్షన్ పట్టుకుందట..