రేవంత్ రెడ్డి వైరల్ ట్వీట్‌కు స్పందించిన టీఆర్‌ఎస్ మంత్రి

Thu Jun 10 2021 21:50:21 GMT+0530 (IST)

TRS Minister responds to Firebrand MP tweet which claims he is the next to leave the party

టిఆర్ఎస్ మంత్రి జగదీష్ రెడ్డిపై కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ నాయకుడు రేవంత్ రెడ్డి పడ్డాడు. తాజాగా రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ వైరల్ అయింది. వాస్తవానికి ఈ ట్వీట్ తెలంగాణ రాజకీయ వర్గాలలో భారీ చర్చకు దారితీసింది. ఈటల రాజేందర్ తర్వాత తెలంగాణ కేబినెట్ నుంచి తొలగించేది మంత్రి జగదీష్ రెడ్డి అని.. సీఎం కెసిఆర్ తదుపరి లక్ష్యం ఆయనే అని రేవంత్ రెడ్డి నర్మగర్భంగా ట్వీట్ చేసి దుమారంరేపాడు..రేవంత్ ట్వీట్ కూడా టీఆర్ఎస్ పార్టీలో చర్చనీయాంశమైంది. ఇది నిజమని కొందరు అంతర్గత వ్యక్తులు విశ్వసించారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి జగదీష్ రెడ్డిని నిజంగానే పంపించివేస్తారా? అని పలువురు ఆరా కూడా తీశారు. దీంతో రేవంత్ రెడ్డి ట్వీట్‌పై మంత్రి జగదీష్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కానీ అతను పూర్తి వివరణ ఇవ్వలేదు.

"నిస్సహాయ వ్యక్తులు.. వారి నిరాశాజనక వ్యాఖ్యలు. ఇలాంటి పనికిరాని పుకార్లను ఉద్దేశపూర్వకంగా ప్రత్యర్థులు వ్యాప్తి చేస్తున్నారు. దీనిపై నేను స్పందించాల్సిన అవసరం లేదు ” అని జగదీష్ రెడ్డి సమాధానాన్ని దాటవేశారు. మీడియా జర్నలిస్టులు సైతం ఇదే  ప్రశ్న అడిగినప్పుడు టీఆర్ఎస్ మంత్రి కోపంగా బదులిచ్చాడు. ఆ తర్వాత కుదుటపడి వారికి అలాంటిదేమీ లేదని సమాధానమిచ్చాడు.

రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ నిజమో కాదో తెలియదని.. కానీ  తన చుట్టూ ఏదో చేస్తున్నారని జగదీష్ తీవ్రంగా బాధపడ్డాడు. మొదట్లో ఈటల రాజేందర్ విషయంలో కూడా ఇలానే జరగడంతో జగదీశ్ రెడ్డి ఈ ట్వీట్ పై ఆందోళన చెందారు. ఇదే పద్ధతిలో జగదీశ్ రెడ్డికి జరుగుతుందా? అన్నది వేచిచూడాలి.