Begin typing your search above and press return to search.

కవితకు క్లీన్ చిట్ వచ్చేసినట్లేనా ?

By:  Tupaki Desk   |   28 May 2023 10:04 AM GMT
కవితకు క్లీన్ చిట్ వచ్చేసినట్లేనా ?
X
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవిత కు క్లాన్ చిట్ వచ్చేస్తుందా ? ఛార్జిషీట్లలో కవిత పేరు లేకపోవటంతోనే అందరికీ ఇదే విధమైన అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూప్ తరపున కవిత పాత్ర చాలా కీలకమని, ఆమే సూత్రదారని ఈడీ చాలాసార్లు ఆరోపించింది. గతంలో కోర్టుల్లో దాఖలు చేసిన ఛార్జిషీట్లలో కూడా కవిత పేరును చాలాసార్లే ప్రస్తావించిన విషయం తెలిసిందే. అలాంటిది తాజా ఛార్జిషీట్లో కవిత పేరు లేకపోవటమే ఆశ్చర్యంగా ఉంది.

సీబీఐ 5700 పేజీలతో చార్జిషీటు దాఖలు చేసింది. అందులో ఎక్కడా కవిత పేరులేదట. అలాగే ఈడీ దాఖలుచేసిన చార్జిషీటులో కూడా కవిత పేరు కనబడలేదని సమాచారం. అంటే దర్యాప్తుసంస్ధలు దాఖలుచేసిన ఛార్జిషీట్లలో కవిత పేరు లేదంటే తొందరలోనే క్లీన్ చిట్ వచ్చేయటం ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది. స్కామ్ లో పాత్రదారులతో కవిత హైదరాబాద్, ఢిల్లీలో చాలాసార్లు మీటింగ్ పెట్టుకున్నారని, మొత్తం స్కామ్ లో ఆమే కీలకమని ఈడీ చాలాసార్లు ఆరోపించిన విషయం తెలిసిందే.

మూడుసార్లు కవితను ఢిల్లీలోని తన ఆఫీసులోనే ఈడీ విచారించింది. విచారణకు పిలిచిన ప్రతిసారి అరెస్టు ఖాయమని మీడియా మొత్తం గోలగోల చేసేసింది. అయితే తర్వాత తెరవెనుక ఏమైందో ఏమో ఏ దర్యాప్తుసంస్ధ కూడా కవితను విచారణకు పిలవలేదు. తాజాగా దాఖలుచేసిన చార్జిషీట్లలో అసలు కవిత ప్రస్తావనే లేకపోవటం విచిత్రంగానే ఉంది. మరి చార్జిషీట్లో కవిత పేరే లేదంటే ఇంకెందుకు ఈడీ విచారణ పేరుతో ఎందుకంత హడావుడి చేసిందో అర్ధంకావటంలేదు.

విచారణ సందర్భంగా దాఖలుచేసిన చార్జిషీట్లో కవిత పాత్రపై అనేక ఆధారాలున్నట్లు ఈడీ కోర్టులో స్పష్టంగా చెప్పింది. అలాంటిది ఒక్కసారిగా కవిత పేరును తీసేయటం వెనుక ఏమైందనేది సస్పెన్సుగా మారిపోయింది. ఇదే విషయమై బీజేపీలోని నేతల మధ్యే గందరగోళంగా ఉంది. లిక్కర్ స్కామ్ లో కవితను ఈడీ అరెస్టుచేయని కారణంగానే బీజేపీ-బీఆర్ఎస్ మధ్య ఏదో సంబంధాలున్నాయని జనాలు అనుకుంటున్నట్లు ఈమధ్యనే కమలనాదుడు కొండా విశ్వేశ్వరరెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలే నిజమయ్యేట్లున్నాయి చివరకు.