ఈటలకు సమఉజ్జీ ఈ నేతేనా ?

Fri May 07 2021 14:07:45 GMT+0530 (IST)

TRS Ex MP Vinod Kumar Counter to Etela Rajender

ఒకవేళ హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమైతే టీఆర్ఎస్ లో ఎవరు నిలబడతారు ? ఇపుడిదే విషయం రాష్ట్రంలో ఆసక్తిగా మారింది. అయితే టీఆర్ఎస్ పార్టీలోను కేసీయార్ సన్నిహిత వర్గాల ప్రకారం బోయినపల్లి వినోద్ కుమార్ నే రంగంలోకి దింపటానికి సీఎం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మాజీ ఎంపి అయిన వినోద్ కుమార్ ప్రస్తుతం రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షునిగా ఉన్నారు. పార్టీలో  సీనియరే నేతేకాకుండా కేసీయార్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరుగా పాపులర్.అలాంటి వినోద్ ను అవసరమైతే ఈటల మీద పోటికి దింపటానికి కేసీయార్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఒకపుడు వినోద్ కరీంనగర్ ఎంపిగా కూడా పనిచేశారు. అప్పట్లో కరీంనగర్ పార్లమెంటు స్ధానంలోని ఏడు అసెంబ్లీల్లో హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఉండేది. వినోద్ బాగా చురుగ్గా ఉంటారు కాబట్టి అందరు ఎంఎల్ఏలతోను మంచి సంబంధాలే కంటిన్యు చేశారట. కాబట్టి రేపు వినోద్ పోటీ చేసినపుడు పాత పరిచయాలు అక్కరకు వస్తాయని కేసీయార్ భావించారట.

ఇక ఈటల విషయం చూస్తే గ్రౌండ్ లెవల్లో చాలా బలమైన నేతన్న విషయం అందరికీ తెలిసిందే. పైగా తెలంగాణాలో బీసీ సామాజికవర్గం చాలా బలంగా ఉంది. అలాంటి బీసీల్లో ముత్తరాసి ఉపకులానికి చెందిన ఈటలను కేసీయార్ మంత్రివర్గం నుండి చాలా అవమానకరంగా బయటకు పంపారనే అభిప్రాయం జనాల్లో ఉంది. అందుకనే ఈటల నాలుగు రోజులుగా బీసీ సామాజికవర్గాలతో పాటు కేసీయార్ వ్యతిరేకవర్గాలతో కూడా రెగ్యులర్ గా సమావేశాలు పెడుతున్నారు. ఎన్ఆర్ఐలు కూడా ఈటలకు తమ మద్దతు ప్రకటించారు.

మొత్తానికి ఒకవైపు ఈటల మరోవైపు బహుశా వినోద్ పోటీచేస్తే తెలంగాణాలో రాజకీయ మంటలు లేవటం ఖాయం. మరి ఈ నేపధ్యంలో  మిగిలిన పార్టీలు ఏమి చేస్తాయో చూడాలి. కేసీయార్ మీద కోపంతో రగిలిపోతున్న బీజేపీ+కాంగ్రెస్ లోని కొందరు నేతలు ఈటలకు మద్దతిస్తారనే ప్రచారం మొదలైపోయింది. చూడబోతే రాజేందర్ రాజీనామా చేసి ఉపఎన్నికలు వస్తేమాత్రం మాత్రం హై ఓల్టేజీ ఎన్నికగా మారిపోవటం ఖాయం. మరి చూద్దాం చివరకు ఏమవుతుందో.