Begin typing your search above and press return to search.

త‌ల్లిని, చెల్లిన రోడ్డున ప‌డేశాడు.. క‌డ‌ప‌కు ఏం చేస్తాడు?

By:  Tupaki Desk   |   31 May 2023 9:22 PM GMT
త‌ల్లిని, చెల్లిన రోడ్డున ప‌డేశాడు.. క‌డ‌ప‌కు ఏం చేస్తాడు?
X
టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ సీఎం జ‌గ‌న్‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. త‌ల్లిని చెల్లిన రోడ్డున ప‌డేసిన జ‌గ‌న్‌... సొంత వారినే వ‌దిలించుకున్న జ‌గ‌న్‌.. సొంత జిల్లా క‌డ‌ప‌కు ఏం న్యాయం చేస్తాడ‌ని ఆయ‌న నిల‌దీశారు. యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో భాగంగా.. ఆయ‌న క‌డ‌ప జిల్లాలో పాద‌యాత్ర చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ.. "తల్లి, చెల్లిని సీఎం జగన్‌ రోడ్డు మీదకు గెంటేశారు. తల్లి లాంటి కడప జిల్లాకు కూడా అన్యాయం చేశారు. జగన్‌ పాలనలో చేనేత కార్మికులు బాధితులే. చేనేత కార్మికులు పడుతున్న ఇబ్బందులపై కనీసం సమీక్ష చేసే తీరిక కూడా సీఎం జగన్‌కు లేదు.`` అని విమ‌ర్శ‌లు గుప్పించారు.

రాష్ట్ర వ్యాప్తంగా చేనేతను దత్తత తీసుకుంటాన‌ని నారా లోకేష్ చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేతపై ఉన్న 5శాతం జీఎస్టీ భారం పడకుండా చేస్తామ‌న్నారు. చేనేత కార్మికులకు కామన్‌ వర్కింగ్‌ షెడ్లు, టిడ్కో ఇళ్లు ఏర్పాటు చేస్తామ‌ని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో చంద్రన్న బీమా పథకాన్ని మళ్లీ ప్రవేశ పెడతామ‌ని నారాలోకేష్ చెప్పారు. మగ్గం ఉన్న చేనేత కార్మికులకు 200 యూనిట్ల విద్యుత్ అందజేస్తాం అని భరోసా ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేతపై ఆధారపడిన రైతులు, రంగులు అద్దె కార్మికుల దగ్గర నుంచి మాస్టర్ వీవర్ వరకూ అందరినీ ఆదుకుంటామని చెప్పారు.

జగన్ పాలనలో చేనేత కార్మికులకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని కార్మికులందరూ వీధిన పడే పరిస్థితి తలెత్తిందని లోకేష్ కు చేనేత కార్మికులు మొర పెట్టుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న రాష్ట్రవ్యాప్తంగా చేనేతను దత్తత తీసుకుంటామని హామీ ఇచ్చారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత మగ్గాల సంఖ్య తగ్గిపోయిందని విమర్శించారు. ప్రభుత్వం నుంచి సాయం లేక చేనేత కార్మికులు ఇతర రంగాలకు వెళ్లిపోతున్నారన్నారు.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనలో చేనేత కార్మికులు బాధితులు అని.. కనీసం చేనేత కార్మికులు పడుతున్న ఇబ్బందులపై సమీక్ష చేసే తీరిక కూడా ఆయనకు లేదనీ నారా లోకేష్ విమర్శించారు. యువగళం పాదయాత్రలో భాగంగా.. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో పర్యటిస్తున్న లోకేష్‌ చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించారు. చేనేత కార్మికులకు బీమా పథకాన్ని రద్దు చేశారని.. నేత కార్మికులకు ఇళ్లు లేక ఇబ్బంది పడుతున్నామని వారు విన్నవించారు.