Begin typing your search above and press return to search.

టీడీపీ మూస ధోర‌ణి.. ఇలా అయితే.. క‌ష్ట‌మేనా..?

By:  Tupaki Desk   |   13 Jun 2021 7:30 AM GMT
టీడీపీ మూస ధోర‌ణి.. ఇలా అయితే.. క‌ష్ట‌మేనా..?
X
ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీ మూస‌ధోర‌ణిలోనే ముందుకు సాగుతోందా ? గ‌త ఎన్నిక‌ల్లో ఎదురైన ఘోర వైఫ‌ల్యం.. త‌ర్వాత స్థానిక ఎన్నికల్లో ఎదురైన ప‌రాభావం.. వంటి ప‌ర్య‌వ‌సానాల త‌ర్వాత‌.. పార్టీ పుంజుకునే తీరు స‌మూలంగా మారిపోతుంద‌ని అనుకున్నా.. ఇప్ప‌టికీ అలాంటి మార్పు ఎక్క‌డా క‌నిపించడం లేద‌ని.. యువ నేత‌లు వాపోతున్నారు. పార్టీ నేత‌ల్లో ఉత్సాహం నింపుతాన‌ని ప‌దే ప‌దే చెబుతున్న చంద్ర‌బాబు ఆదిశ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు చ‌ర్య‌లు తీసుకోలేదు. పైగా.. లోకేష్‌ను ప్ర‌మోట్ చేసేందుకు మాత్ర‌మే ఉత్సాహం చూపుతున్నారు.

వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల్లో వైఫ‌ల్యం చెంది రెండేళ్లు పూర్తయినా.. భ‌విష్య‌త్తుపై ప్ర‌త్యేక దృష్టిని కేంద్రీక‌రించ‌డం లేద‌నే వాద‌న ఉంది. నిజానికి ఇప్పుడున్న ప‌రిస్థితి మ‌రో ఆరు మాసాలు కొన‌సాగితే.. పార్టీ ప‌రిస్థితి క‌ష్ట‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్ప‌టికే క‌డ‌ప‌, క‌ర్నూలు, చిత్తూరు.. స‌హా కోస్తాలోని ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లోనూ పార్టీ ప‌రిస్ధితి దారుణంగా ఉంది. ఈ ప‌రిస్థితిని మార్చేందుకు పార్టీ అధినేత చంద్ర‌బాబు కానీ.. ఆయ‌న కుమారుడు లోకేష్ కానీ.. ప్ర‌య‌త్నించ‌డం లేదు.

కేవ‌లం.. లోకేష్‌.. త‌న హ‌వాను ప్ర‌ద‌ర్శించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌నే వాద‌న సీనియ‌ర్ల నుంచి వినిపిస్తోంది. అంతేత‌ప్ప‌.. క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌ట‌న‌లు చేయ‌డం లేదు. స‌రిక‌దా.. క్షేత్ర‌స్థాయిలో పార్టీని ముందుకు న‌డిపించే వ్యూహాల‌ను కూడా ఆయ‌న వేయ‌లేక పోతున్నార‌నేది వీరి కీల‌క విమ‌ర్శ‌. అదే స‌మ‌యంలో చంద్ర‌బాబు కూడా ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఆన్‌లైన్‌కే ప‌రిమితం అవుతున్నార‌ని చెబుతున్నారు. ఇలా.. మొత్తంగా చూస్తే.. ప్ర‌ధాన నేత‌లే ఇలా ఉంటే.. పార్టీలో మిగిలిన వారి ప‌రిస్థితి ఏంటి? అనేది తేలడం లేదు.

ప్ర‌స్తుతం ఏపీలో టీడీపీ పుంజుకునేందుకు అనేక అవ‌కాశాలు ఉన్నాయి. క‌రోనా నేప‌థ్యంలో త‌లెత్తిన ఆర్థిక లోపాలు.. ప్ర‌భుత్వ లోపాలు వంటివి అందిపుచ్చుకుని.. పార్టీ దూసుకు వెళ్లేందుకు ఇదే గోల్డెన్ ఛాన్స్‌. అయితే టీడీపీ నేత‌లు ఆదిశ‌గా అడుగులు వేయ‌లేదని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఇక‌, పార్టీలో నేత‌ల‌ను క‌లిసి క‌ట్టుగా న‌డిపించేందుకు కూడా చ‌ర్య‌లు తీసుకోవాల్సి ఉన్న‌ప్ప‌టికీ.. ప‌ట్టించుకోవ‌డం లేదు. దీంతో పార్టీ ప‌రిస్థితి ఇబ్బందిగా మార‌డం ఖాయ‌మ‌ని.. చంద్ర‌బాబు ఇప్ప‌ట‌కి అయినా వీటిపై దృష్టి పెట్టి వ‌చ్చే ఆరు మాసాల్లో మార్పు తీసుకురావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.