Begin typing your search above and press return to search.

పాదయాత్రీకుడు లోకేష్ ని అలా చూడాలనుకుంటున్న చంద్రబాబు

By:  Tupaki Desk   |   29 Jan 2023 8:00 PM GMT
పాదయాత్రీకుడు లోకేష్ ని అలా చూడాలనుకుంటున్న చంద్రబాబు
X
నారా లోకేష్ పాదయాత్ర స్టార్ట్ చేశారు. లోకేష్ పాదయాత్ర పేరిట దేశంలో ఏ రాజకీయ నాయకుడూ కూడా చేయని బిగ్ రిస్క్ చేస్తున్నారు అని కూడా చెప్పాలి. ఆయన ఏకంగా  నాలుగు వేల కిలోమీటర్ల దూరాన్ని తన కాళ్లతో కొలవనున్నారు. ఇప్పటిదాకా అంతదూరం ఏకబిగిన నడిచిన నాయకుడు దేశంలో ఎవరూ లేరు. లోకేష్ వంటి గొల్డెన్ స్పూన్ తో పెరిగిన వారికి కార్లు, విమానాలు రెడ్ కార్పేట్లూ రాచబాటగా ఉంటాయి తప్ప రెండు కాళ్ళకు పనిచెప్పే పరిస్థితి ఎపుడూ ఉండదు.

ఇక చంద్రబాబు తనయుడిగా లోకేష్ చూసే ప్రపంచం వేరు అది హై లెవెల్ లో ఉంటుంది. ఆయన పరిచయాలు ఆయన వద్దకు వచ్చే వ్యక్తులు వారితో మాట్లాడే తీరు అంతా కూడా ఒక ఉన్నత ప్రపంచంలో సాగిపోయే వ్యవహారంగా ఉంటుంది. కానీ ప్రపంచం అంటే పైన లేదు దిగువన ఉంది. అందునా రాజకీయాల్లో రాణించే వారికి సమాజం లోతులు చూడాల్సిన అవసరం ఉంది.

గ్రౌండ్ లెవెల్ లో రియాల్టీస్ ఎలా ఉన్నాయి. ప్రజలు ఎలా బతుకుతున్నారు. రోజుకు యాభై రూపాలు కూడా సంపాదించుకోలేని వారు ఎలా జీవన పోరాటం చేస్తున్నారు. కోట్లాది మంది ప్రజల సగటు జీవితం ఎలా ఉంది ఇవన్నీ తెలుసుకోవాలంటే కచ్చితంగా పాదయాత్ర చాలా ఉపయోపడుతుంది. నేరుగా ప్రజల్తో కనెక్ట్ అయ్యేదిగా పాదయాత్ర ఉంటుంది. ప్రతీ ఒక్కరితోనూ డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంటుంది.

అలాగే ఒక నాయకుడిగా ఎదగాలన్నా సర్వ జనామోదం కావాలన్నా కూడా పాదయాత్ర అతి ముఖ్యమని భావించే చంద్రబాబు లోకేష్  పాదయాత్రకు ఓకే చెప్పారు అని అంటున్నారు. లోకేష్ ఈ పాదయాత్ర ద్వారా రాజకీయంగానే కాదు వ్యక్తిగా నేతగా రాటుదేలుతాడు అని చంద్రబాబు భావిస్తున్నారు అని అంటున్నారు.

లోకేష్ చంద్రబాబు కుమారుడిగానే ఇప్పటిదాకా ఉన్నారు. ఆయనలో ఆ దర్పం దర్జా ఎంతో కొంత కనిపిస్తాయి. ఇపుడు ఆయన జనంలోకి వచ్చాక వారితో కలసిమెలసి తిరిగాక కచ్చితంగా తన బాడీ లాంగ్వేజ్ తో పాటు భాష కూడా మారుతుంది. ఎవరితో ఎలా ఉండాలో తెలుస్తుంది. అలాగే కొత్త ప్రపంచాన్నే లోకేష్ చూస్తారు అని చంద్రబాబు ఆలోచించే ఆయనను జనంలోకి పంపారని అంటున్నారు.

లోకేష్ పాదయత్ర తరువాత కచ్చితంగా ఆయన నాయకత్వ పటిమ పెరుగుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అలాగే వ్యక్తిత్వ వికాసానికి అతి పెద్ద మార్గంగా పాదయాత్ర ఉంటుంది అని కూడా నమ్ముతున్నారు. ఏపీలో పాదయాత్ర చేసిన వారిలో వైఎస్సార్, చంద్రబాబు, షర్మిల, జగన్ ఉన్నారు. ఇందులో వైఎస్సార్, చంద్రబాబు జగన్ సీఎంలు కూడా అయ్యారు. అంటే ఒక విధంగా పాదయాత్ర సెంటిమెంట్ గా ఉంది.

లోకేష్ కి కూడా కలసివస్తే కచ్చితంగా ఆయన కూడా రాజకీయంగా ఉన్నత శిఖరాలను అందుకునేందుకు పాదయాత్ర సెంటిమెంట్ దోహదపడుతుంది అని చంద్రబాబు నమ్ముతున్నారు. అలాగే తనతో సహా అంతా పాదయాత్ర తరువాత గణనీయంగా మారారాని, అలాంటి మార్పునే కొడుకు నుంచి ఆయన ఆశిస్తున్నారు అని అంటున్నారు.

ఇక రేపటి రోజున జనసేన తెలుగుదేశం పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చినా కూడా ఆ క్రెడిట్ పవన్ కే పోకుండా చాలా వరకూ లోకేష్ కూడా దక్కేలా పాదయాత్ర ఉపయోగపడుతుందని చంద్రబాబు వ్యూహాత్మకంగా ఆలోచించి పాదయాత్రకు సై అన్నారని అంటున్నారు. ఇక లోకేష్ పాదయాత్ర ఈ రోజుతో మొదలుపెడితే వచ్చే ఏడాది ఎన్నికల వరకూ సాగుతుంది. అందువల్ల పాదయాత్ర ప్రభావం కచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా ఉంటుంది.

ఏకంగా 125 నియోజకవర్గాలను తాకుతూ లోకేష్ చేసే పాదయాత్ర ద్వారా నేరుగా జనాభిప్రాయం కూడా సేకరించి దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే వీలు ఉంటుంది. అంటే సర్వేల కంటే కూడా లోకేష్ ద్వారా నేరుగా అసలైన అభిప్రాయం జనం నుంచి డైరెక్ట్ గా తీసుకోవడం తెలుగుదేశానికి కలిగే అతి పెద్ద లాభం. మొత్తానికి చూస్తే లోకేష్ పాదయాత్ర తెలుగుదేశం బహుముఖ వ్యూహంలో భాగంగా ఉంది అంటున్నారు.