Begin typing your search above and press return to search.

'నానీ' ని ఏం చేద్దాం.. టీడీపీలో పెను దుమారం!

By:  Tupaki Desk   |   3 Jun 2023 8:00 AM GMT
నానీ ని ఏం చేద్దాం.. టీడీపీలో పెను దుమారం!
X
విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని వ్య‌వ‌హారం టీడీపీలో పెను దుమారం రేపుతోంది. ఆయ‌న‌ను పార్టీ నుంచి పంపేయాల‌ని మెజారి టీ నాయ‌కులు కోరుతున్న‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల‌ స‌మాచారం. అయితే.. చంద్ర‌బాబు ఈ విష‌యంలో ఆచి తూచి అడుగులు వేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. విజయవాడ పార్లమెంట్‌ నుంచి టీడీపీ తరఫున 2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు గెలుపొందిన ఎంపీ కేశినేని నాని ఆ పార్టీపై పరోక్షంగా చేస్తున్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్న విష‌యం తెలిసిందే.

ఆరు నెలల క్రితం అదే పనిగా పార్టీ అధినేత‌పైనా, స్వ‌యంగా తన సోదరుడు కేశినేని చిన్ని(శివ‌నాథ్‌), పార్టీ నేతలు దేవినేని ఉమా, బొండా ఉమా, బుద్ధా వెంకన్నపై పరోక్షంగా వ్యాఖ్యలు చేసిన కేశినేని నాని మధ్యలో కొంతకాలం సైలెంట్‌గా ఉండిపో యారు.

తాజాగా వారం నుంచి ఆయన మళ్లీ హైకమాండ్‌పై పరోక్షంగా వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. ఇటీవల నందిగామ నియోజకవర్గంలో ఎంపీ నిధులతో చేపట్టిన పనుల ప్రారంభోత్సవానికి వెళ్లిన కేశినేని నాని.. వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావును ప్రశంసలతో ముంచెత్తారు. అదేవిధంగా వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు.

ఈ సందర్భంగా అభివృద్ధి, రాజకీయాలు వేర్వేరని వ్యాఖ్యానించడంతో పాటు విజయవాడ లోక్‌సభ సీటు ఏ పిట్టల దొరకిచ్చినా తనకు ఇబ్బంది లేదన్నారు. ప్రజలు కోరుకుంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికీ సిద్ధమేనన్నారు.

తన మనస్తత్వానికి సరిపోతే ఏ పార్టీ అయినా ఓకే అని, తన మాటలను పార్టీ ఎలా తీసుకున్నా భయం లేదన్నారు. దీంతో కేశినేని నానిపై టీడీపీ అధినేత‌కు పలు ఫిర్యాదులు వెళ్లాయి. చంద్ర‌బాఉబ‌ కూడా కేశినేని నాని వ్యాఖ్యలను నిశితంగా పరిశీలిస్తున్నార‌ని స‌మాచారం.

2019 ఎన్నికల్లో తాను టీడీపీ సానుభూతిపరులే కాకుండా అన్ని పార్టీల వారు ఓట్లు వేస్తే గెలిచానని నాని వ్యాఖ్యలు చేయడాన్ని చంద్ర‌బాబు సీరియస్‌గా తీసుకున్నార‌ని స‌మాచారం. కేశినేని నాని టీడీపీ లైన్‌ దాటి మాట్లాడుతున్నారని, హైకమాండ్‌ను కూడా లెక్కచేయని ధోరణిలో వ్యవహరిస్తున్నారని సీనియర్‌ నాయకులు భావిస్తున్నారు.

పార్టీ మారేందుకు సిద్ధమయ్యే నాని ఇలా వ్యవహరిస్తున్నారని, ఆయ‌న‌పై వేటు వేయాల‌ని టీడీపీలో సీనియ‌ర్ నాయ‌కులు కోరుతున్నారు. కానీ, చంద్ర‌బాబు ఆచి తూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే.. ఇంకొక్క చాన్స్ ఇచ్చి చూశాక‌..అ ప్పుడు నిర్ణ‌యం తీసుకుంటార‌ని సీనియ‌ర్ నేత ఒక‌రు న‌ర్మ‌గ‌ర్భంగా వ్యాఖ్యానించారు.