Begin typing your search above and press return to search.
2024 రానీయ్...తమ్ముళ్ళ కోరస్...?
By: Tupaki Desk | 25 Jan 2022 1:30 AMఇన్నాళ్ళూ పెద్దగా లేవని గొంతులు కూడా ఇపుడు గట్టిగానే సౌండ్ చేస్తున్నాయి. ఏపీలో రాజకీయం మారుతోందని వారికి అర్ధమైందా. జరుగుతున్న పరిణామాలు తమకు కలసివస్తాయన్న ఆశలు ఏమైనా ఉన్నాయా. ఏమో తెలియదు కానీ అందరూ ఒకేసారి కోరస్ గా 2024 అంటున్నారు. వచ్చేది మేమే అని గర్జిస్తున్నారు. దీని వెనక ఏ సర్వే లేదు, మరే జాతకమూ, జోస్యం అంతకంటే లేదు. కేవలం ఏపీలో స్పీడ్ గా మారుతున్న రాజకీయ పరిణామాలే వారికి ఆ ధైర్యం ఇస్తున్నాయి అనుకోవాలేమో.
మరి బుద్ధా వెంకన్న టీడీపీలో సీనియర్ నేత. మాజీ ఎమ్మెల్సీ. అయన క్యాలండర్ లో 2024 రానీయ్. ఇక మేమే పవర్ లోకి అంటున్నారు. అంతే కాదు, మేము వస్తే కనుక మంత్రి కొడాలి నాని సహా నోటి దురుసు నేతల ఆట కట్టు అని కూడా చెప్పేస్తున్నారు. ఏం చేస్తామో చూస్తారుగా అని గట్టిగానే వైసీపీ నేతలను హెచ్చరిస్తున్నారు. డీజీపీ గౌతం సవాంగ్ రిటైర్ అయినా కూడా అసలు వదలబోమని బుద్ధా ఫైర్ అవుతున్నారు.
ఇదే విధంగా బోండా ఉమా లాంటి నేతలు కూడా మేమే అధికారంలోకి ఇక వచ్చేది. అలా కానీయక ఎవరు ఆపుతారో చూస్తామని చెబుతున్నారు. ఇక విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అయితే మీ పని అయిపోయింది ఫ్యాన్ నేతలూ అనేస్తున్నారు. గట్టిగా రెండేళ్ళు మీరు ఉంటే చాలు, ఆ మీదట మీ సీన్ ఏంటో మరి అని వెటకారం ఆడుతున్నారు. ఏపీ ప్రజల ఖర్మ కాలితే జగన్ సీఎం అయ్యాడని కూడా హార్ష్ గా అయ్యన్నభారీ డైలాగులు వదిలేస్తున్నారు.
ఇదే రకమైన ధీమాను చాలా మంది తమ్ముళ్లు వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అయితే ఏపీ రాజకీయం పూర్తిగా మారుతుంది అని చెప్పేస్తున్నారు. అసలు ఇంతకీ ఏం జరుగుతోంది. తమ్ముళ్లకు సడెన్ గా ఏమైంది. ఇప్పటిదాకా వచ్చే ఎన్నికల్లో గెలుస్తామని చంద్రబాబు చెబుతూ వస్తున్నా ఉలుకూ పలుకూ లేని నేతలు అంతా కూడా కూడబలుక్కున్నట్లుగా ఇక ఎప్పటికీ ఏపీకి బాబే ముఖ్యమంత్రి అంటున్నారు అంటే ఇది చాలా ఆలోచించాల్సిన విషయమే.
ఏపీలో అతి పెద్ద సెక్షన్ గా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులతో పెట్టుకున్న ప్రభుత్వాలు ఎపుడూ బతికి బట్టకట్టలేదు. బహుశా అన్ని అంశాల కన్నా ఈ అంశమే తమ్ముళ్ల నోట ఆశాజనకమైన మాటలు మాట్లాడిస్తుంది అనుకోవాలేమో. ఆ సెంటిమెంట్ ఏపీలో వర్కౌట్ అవుతుందని గట్టి ధీమాతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. అదే టైమ్ లో ఏపీలో టీడీపీయే సరైన ఆల్టర్నేషన్ అని కూడా జనాలకు అర్ధమైపోయింది అని భావించి ఉండాలి. ఏది ఏమైనా తమ్ముళ్లలో ధీమా పెరగడం అంటే ఒక విధంగా టీడీపీకి మంచి పరిణామమే. ఇదే జోరులో సాగుతూ గేరు మార్చితే పసుపు పార్టీకి మంచి రోజులు రావడం ఖాయమే అంటున్నారు.