Begin typing your search above and press return to search.
అటెన్షన్ ప్లీజ్: ఉద్యోగుల కు వార్నింగ్ ఇచ్చేసిన టీసీఎస్
By: Tupaki Desk | 1 Jun 2023 10:40 PM ISTకొవిడ్ పుణ్యమా అని వర్కు ఫ్రం ఆఫీస్ అన్నది పోయి వర్కు ఫ్రం హోం అన్నది తెర మీదకు రావటం.. అది కాస్తా ఏకంగా రెండున్న రేళ్లుగా నడవటం తెలిసిందే. వర్కు ఫ్రం హోం దెబ్బకు అప్పటివరకు నగరాల్లో ఉన్న లక్షలాది మంది సొంతూరుబాట పట్టటం తెలిసిందే. కొవిడ్ పరిస్థితులు ఒక కొలిక్కి వచ్చేసిన వేళ.. మళ్లీ ఆఫీసుల కు ఉద్యోగుల్ని ఆయా సంస్థలు వచ్చేయాలని చెప్పటం తెలిసిందే.
ఇందులో భాగంగా కొందరు ఆఫీసు నుంచే పని చేయాలని డిసైడ్ అయితే.. మరికొన్ని సంస్థలు మాత్రం వారంలో మూడు రోజులు ఆఫీసుకు వచ్చి.. మిగిలిన రెండు రోజులు ఇంట్లో నుంచి పని చేసేందుకు వీలుగా హైబ్రిడ్ విధానాన్ని తీసుకొచ్చారు. గడిచిన మూడు నాలుగు నెలలుగా చాలా ఐటీ సంస్థలు వర్కు ఫ్రం హోంకు స్వస్తి పలికిన పరిస్థితి. అయితే.. రెండున్నరేళ్ల కు పైనే ఆఫీసులకు రావటం బంద్ చేసి.. ఇంట్లో నుంచే పని చేయటం అలవాటు పడిన చాలామంది ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచి పని చేసేందుకు ఉన్న అవకాశాల్ని వెతుకుతున్నారు. మరికొందరు.. సంస్థ ఆదేశాల్ని లైట్ తీసుకోవటం మొదలైంది.
ఇలాంటి వేళ.. వేలాది మంది ఉద్యోగులున్న టీసీఎస్ తమ ఎంప్లాయిస్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చేసింది. వారంలో మూడు రోజుల పాటు ఆఫీసు కు వచ్చి పని చేయాలన్న నిబంధనను పక్కాగా ఫాలో కావాలని.. అలా చేయని వారి పై కఠినంగా చర్యలు తీసుకుంటామని ఉద్యోగులకు తాజాగా వార్నింగ్ ఇచ్చేసింది. వారంలో మూడు రోజులు ఆఫీసుకు రావాలని తమ ఉద్యోగుల కు టీసీఎస్ అక్టోబరు నుంచి చెబుతున్నా.. ఆ మాటనుపట్టించుకోని ఉద్యోగుల విషయంలో తాజా గా కన్నెర్ర చేసింది.
ఉద్యోగుల కు ఇచ్చిన ఆదేశాల ప్రకారంనెలకు12 రోజులు ఆఫీసు నుంచి పని చేయాల్సి ఉన్నా.. కొందరు ఉద్యోగులు ఈ రూల్ ను లైట్ తీసుకోవటంతో.. వారికి తాజాగా నోటీసులు పంపించటం మొదలుపెట్టింది. వారికి కేటాయించిన ఆఫీసు కు వెంటనే వచ్చి రిపోర్టు చేయాలని.. ఒకవేళ ఆ రూల్ ను బ్రేక్ చేస్తే.. అలాంటి వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని ఉద్యోగుల కు జారీ చేసిన మెమో లో వార్నింగ్ ఇవ్వటం గమనార్హం.
గడిచిన రెండేళ్లుగా కొత్త ఉద్యోగులు చాలామంది సంస్థలో జాయిన్ అయ్యారని.. వారికి కలిసి పని చేయటం.. తోటి ఉద్యోగులతో గడపటంలాంటివి కూడా అవసరమని పేర్కొన్నారు. పని వాతావరణం అలవర్చుకోవటం వారికి ఎంతో ముఖ్యమని పేర్కొంటూ సంస్థ పేర్కొన్నట్లుగా ఆఫీసుకు వచ్చి పని చేయాలని స్పష్టం చేసింది. సో.. టీసీఎస్ ఉద్యోగులు పారాహుషార్.